news18
Updated: November 28, 2020, 10:49 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 28, 2020, 10:49 PM IST
కొడుకు బాగు కోరి.. తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ తండ్రికి.. ఏ కొడుకూ ఇవ్వలేని బహుమతి ఇచ్చాడు ఓ సుపుత్రుడు. ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్నను.. ఇకపై ప్రపంచం చూడకుండా చేశాడు. తనను భుజాలపై ఎత్తుకుని పెంచిన తండ్రి పాడె మోసే అత్యంత హేయమైన పనికి ఒడిగట్టాడు. తాగిన మైకంలో తానేం చేస్తున్నాడో తెలియకుండా ఉన్మాది లా ప్రవర్తించాడు. పెద్దపెల్లి జిల్లాలోని గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మైకంలో ఉన్న ఓ కొడుకు ఏకంగా తండ్రినే హత్య చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం... గోదావరిఖని లోని తిలక్ నగర్ కు చెందిన ఆడెపు బాపు రాజేశంను ఆయన కుమారుడే హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కాడు. రాజేశం రెండేళ్ల క్రితం మెడికల్ గా అన్ ఫిట్ అవడంతో తన కుమారుడు బుచ్చిబాబుకు ఉద్యోగం ఇచ్చాడు. కానీ బుచ్చిబాబు మాత్రం డ్యూటీలకు సరిగా వెళ్లకుండా.. వచ్చిన జీతమంతా మద్యానికే ఖర్చు చేసేవాడు.
ఇది కూడా చదవండి.. నలుగురు కూతుళ్ల గొంతుకోసి... తాను ఆ పని చేస్తుండగా పట్టుబడ్డ తల్లి.. గురుగ్రాంలో దారుణం
మద్యానికి బానిసైన బుచ్చిబాబు తాగిన మత్తులో ఇంటిలో తన మాట నెగ్గించుకునే పంతంలో కుటుంబసభ్యులపై వాదులాటకు దిగేవాడు. తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం ఎవరూ లేని సమయంలో తండ్రిపై పదునైన రాడుతో కొట్టి చంపాడు. ఎవరికీ అనుమానం రాకుండా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 28, 2020, 10:44 PM IST