హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tragedy : కోడలిపై మామ దారుణం.. ఇంట్లోనుండి వెళ్లగొట్టెందుకు ఇలా చేశాడు..

Tragedy : కోడలిపై మామ దారుణం.. ఇంట్లోనుండి వెళ్లగొట్టెందుకు ఇలా చేశాడు..

Tragedy : కోడలిపై మామ దారుణం..

Tragedy : కోడలిపై మామ దారుణం..

Tragedy : కోడలిపై మామ దారుణం.. ఇంట్లోనుండి వెళ్లగొట్టెందుకు ఇలా చేశాడు.. భర్తను కోల్పోయిన కోడలుపై మామ కక్ష కట్టాడు.. కోడలితోపాటు మనవరాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లోనుండి తరిమివేసేందుకు బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు రికార్డ్ చేశాడు.

ఇంకా చదవండి ...

కొన్ని కారణాల వల్ల భర్త కోల్పోయిన భార్య తన అత్తగారి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు ఓ కూతురు కూడా ఉండడంతో ఉపాధి కోసం ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటు బతుకు వెళ్లదీస్తోంది. అయితే తన కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఇంట్లో ఎందుకు అనుకున్నాడు ఓ మామ, కొడలితోపాటు మనవరాలి బాగోగులను చూసుకోవాల్సిన మామ అందుకు విరుద్దంగా ఆలోచించాడు. కోడలు తన ఇంట్లో ఉండకూడదని హుకుం జారీ చేశాడు. వినకపోతే ఘోరంగా ప్రవర్తించాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన షాలినికి వివాహం జరిగి ఒక కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో తన బిడ్డ కోసం ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటుంది. అయితే అప్పటికే కూతురు కూడా పెద్దది కావడంతో ఆమెతోనే కలిసి కాలం వెళ్లదీస్తోంది. షాలిని మామకు మాత్రం ఇష్టం లేదు.. కొడుకు లేకుండా కోడలు ఆమె పిల్లలు ఇంట్లో ఉండకూడదని చెప్పాడు. వారిని వేధింపులకు గురి చేశాడు. కాని వాళ్లు బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఎలాగైన వారిని బయటకు పంపించే కుట్రకు తెరలేపాడు.

ఇది చదవండి : హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవాలు.. కోట్ల రూపాయలతో దున్నపోతుల అలంకరణ


దీంతో కోడలు, మనవరాలు అనికూడ చూడకుండా ప్రవర్తించాడు. ఇంట్లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. కోడలుతో పాటు మనవరాలి నగ్నవీడియోలు రికార్డు చేశాడు. ఈ విషయాన్ని వారికి చెప్పడంతో కోడలు ఖంగుతింది.. వెంటనే ఇంటినుండి బయటకు వెళ్లిపోకపోతే.. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఎవరికైనా చెప్పినా ఇదే పరిస్థితి ఉంటుందని హుకుం జారీ చేశారు.

ఇది చదవండి : చత్రీనాక పేలుళ్లలో కొత్త ట్విస్ట్... బాంబులతోపాటు కెమికల్స్ కలిపి పేల్చిన యువకులు


దీంతో అయోమయంలో ఉన్న షాలిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడింది. ఇలా కొద్ది రోజులు చూసి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును నమోదు చేసకున్న పోలీసులు మామాను స్టేషన్‌కు పిలిచి విచారణ జరుపుతున్నారు.

First published:

Tags: Crime, National News, Rajastan

ఉత్తమ కథలు