హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Karimnagar : అక్రమ సంబంధం అంటగట్టిన మామపై దారుణం.. అర్థరాత్రి మరో యువకుడితో కలిసి..

Karimnagar : అక్రమ సంబంధం అంటగట్టిన మామపై దారుణం.. అర్థరాత్రి మరో యువకుడితో కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karimnagar : తనకు అక్రమ సంబంధాన్ని అంటగడుతున్న మామ ప్రచారాన్ని ఓ కోడలు భరించలేకపోయింది. దీంతో మామతో నిత్యం ఘర్షణకు దిగుతూనే.. ఓ అర్థరాత్రి దారుణంగా హతమార్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కరీంనగర్ జిల్లా.తే.న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి

కుటుంబ బంధాల్లో మాటలు, అవమానాలే వారిలో కుట్రలు, కుతంత్రాలకు తెర తీస్తాయి.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు పత్యారోపణలు చేసుకోవడం.. నిత్యం ఘర్షణలకు దారి తీయడం.. ఒక్కోసారి కుటుంబ సభ్యులనే భేదం లేకుండా హతమారుస్తాయి. ( father in law killed by daughter in law ) ఇలా ఓ మామ తనపై దుష్ప్రాచారం చేస్తున్నాడంటూ కొడలు దారుణానికి ఒడిగట్టింది. మరోకరితో కలిసి 70 ఏళ్ల వృద్దుడిని దారుణంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హుజూరాబాద్ ( Huzurabad ) పరిధిలోని కాచారం గ్రామానికి చెందిన డెబ్బై ఏళ్ల మాతంగి కనకయ్య ఈ నెల 27 న దారుణ హత్యకు ( Murder ) గురయ్యాడు . సమాచారం అందుకున్న హుజూరాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు . ( father in law killed by daughter in law ) హత్య వెనక ఆమె కొడలే ఉందనే ప్రాధమిక సమాచారం అందుకున్న పోలీసులు ఆదిశగా దర్యాప్తు కొనసాగించారు.. ఈ క్రమంలోనే కనకయ్య భార్య , కుమారుడు గతంలోనే మృతి చెందారు దీంతో ఆయన కోడలు కొమురమ్మతో కలసి ఉంటున్నాడు. ఇటీవల కోడలు కొమురమ్మ గురించి కనకయ్య తప్పుగా మాట్లాడుతున్నాడు .( father in law killed by daughter in law ) ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆమెను దూషిస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా వాగ్వావాదం చోటు చేసుకుంటుంది. అయినా మామ కనకయ్య మాత్రం తన ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. దీంతో ఆ ప్రచారాన్ని భరించలేని కోడలు మామను కడతేర్చాలనే ప్లాన్ వేసింది.

Maoist : మావోయిస్టు వారోత్సవాలు.. ఏజెన్సీలో హైఅలర్ట్‌.. స్వయంగా డీజీపీ పర్యటన

మరోవైపు ఇలా ప్రచారం కొనసాగించడతో పాటు తన ఆస్తిని కూడా వారసత్వంగా ఇచ్చే అవకాశాలు కూడా కనిపించకోవడంతో ఆమె దారుణమైన ప్లాన్‌కు తెరలేపింది. దీంతో మామను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది . అయితే ఆమె ఒక్కరే హత్య చేసేందుకు ధైర్యం చాలక పోవడంతో ఇందుకోసం ప్రవీణ్ అనే తన అక్క కొడుకు సహాయం తీసుకుంది. దీంతో గత నెల 27 మామ హత్యకు ప్లాన్ వేసింది. ( father in law killed by daughter in law )అర్దరాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రవీణ్‌తో కలిసి కనకయ్య తలపై కర్రతో బలంగా కొట్టారు. అనంతరం ఆయన గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం అర్థరాత్రి పూట సాధరణ మరణంగా చీత్రీకరించే ప్రయత్నం చేశారు.

Cyber crime : ఇదిగో అర్డర్.. అంటూ పండ్ల వ్యాపారీకి టోకరా.. శృతిమించిన సైబర్ వల

విషయం తెలుసుకున్న పోలీసులు ( Police ) సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి గొంతుపై తాడుతో బిగించిన అనావాళ్లు ఉండడంతో ఆనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిందితులను అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారణ జరిపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తామే కనకయ్యను హత్య చేశామని ఒప్పుకోవడంతో ఇద్దరిని రిమాండ్ పంపారు పోలీసులు.

First published:

ఉత్తమ కథలు