కోడలిపై కన్నేసిన మామ.. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి వెళ్లి...

కోడలిపై కన్నేసిన మామ

అత్తమామలను... తల్లిదండ్రుల తర్వాత... అంతటివారిగా చూస్తారు కోడళ్లు. కానీ ఈ రోజుల్లో మంచి, చెడూ లేకుండా పోతోంది. నమ్మిన వారే నయవంచకుల్లా మారుతున్నారు. ఆ కోడలి జీవితంలో ఏమైందో తెలుసుకుందాం.

 • Share this:
  అది గుజరాత్... అహ్మదాబాద్. నగరంలోని తూర్పు ప్రాంతం. కొత్తగా పెళ్లైన ఓ అమ్మాయి... మెట్టినింట అడుగుపెట్టింది. సహజంగానే అలా వెళ్లే అమ్మాయిలకు కొత్త కుటుంబం ఎలా ఉంటుందో, తనను ఎలా చూసుకుంటారో అనే టెన్షన్ ఉంటుంది. దాన్ని పోగొట్టాల్సింది పోయి... ఆ అమ్మాయిపై కన్నేశాడు మామ. శత్రువు ఎక్కడో లేడు... ఇంట్లోనే ఉన్నాడంటే... ఇక తప్పించుకోవడం కష్టం. అలాటి విపత్కర పరిస్థితి ఆ కొడలు పిల్లకు వచ్చింది. 30 ఏళ్ల వస్త్రపాల్ ఏరియాకి చెందిన ఆమెకు... తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఈ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి... గుజరాత్‌లో ఉంటోంది. పెళ్లి చేసినప్పుడు రూ.25 లక్షలు కట్నంగా ఇచ్చారు. తమ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోమంటే... అలాగే మావయ్య అన్నాడు అల్లుడు.

  పెళ్లైన కొన్నాళ్లకే... కొత్త కాంట్రాక్ట్ అదీ ఇదీ అంటూ... మరింత డబ్బు అవసరం అని ఆమెను టార్చర్ చెయ్యడం మొదలుపెట్టాడు భర్త. ఆల్రెడీ రూ.25 లక్షలు కట్నం ఇచ్చారు కదా... అంటే... అది సరిపోదు... ఎప్పుడో అయిపోయింది... అంటూ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఆమెకు ఏం చెయ్యాలో, తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. పేరెంట్స్‌కి చెబితే... వాళ్లు బాధపడతారని చెప్పకుండా సైలెంట్ అయ్యంది.

  కోడలు ఇలా మదనపడుతూ ఉండటాన్ని చూసిన మామ... ఆమెపై కన్నేశాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి... ఆమె గదిలోకి వెళ్లాడు. ఆ సమంలో ఆమె బట్టలు సర్దుకుంటోంది. వెనక నుంచి వెళ్లి నడుమును ఉడుములా పట్టేసుకొని... గట్టిగా కౌగలించుకోవాలని చూశాడు. షాకైన ఆమె... అత్యంత వేగంగా అతని పట్టు నుంచి తప్పించుకొని... కళ్లెర్రజేసి చూసింది. అయినా వదలని మామ మీదకు ఉరికి... ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు. "ఏమీ చెయ్యకూడదంటే... అదనపు కట్నం తీసుకురా లేకపోతే... నేను ఏం చేసినా సైలెంటుగా ఉండు" అన్నాడు.

  ఇది కూడా చదవండి: జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన భర్త.. ఇంటికి వెళ్లి భార్యను ఏం చేశాడంటే..

  ఆమెకు పిచ్చి కోపం వచ్చింది. అపర కాళికలా మారింది. శక్తినంతా కూడేసి... ముసలాయన్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టింది. వెళ్లి మూలన పడ్డాడు. ఆ క్షణమే ఇంట్లోంచీ బయటకు వెళ్లిన ఆమె... తిన్నగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫ్యామిలీలో అందరిపైనా కంప్లైంట్ ఇచ్చింది. ఏం జరిగిందో మొత్తం చెప్పింది.

  ఇది కూడా చదవండి: ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రేప్... HR మేనేజర్ ఉచ్చులో చిక్కిన యువతి

  ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఆ విషయాన్ని భర్తకు కాల్ చేసి చెప్పింది. ఫలితంగా... పోలీసులు ఆమె ఇంటికి వెళ్లే సరికి... ఇంట్లో ఎవరూ లేరు. అంతా కట్టగట్టుకొని పారిపోయారు. కచ్చితంగా వాళ్లను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. కొత్త పెళ్లి కూతురు... పుట్టింటికి వెళ్లింది.
  Published by:Krishna Kumar N
  First published: