హోమ్ /వార్తలు /క్రైమ్ /

Woman: మహిళపై 12 మంది లైంగిక దాడి.. దారుణాన్ని భర్తకు చెప్పిన భార్య.. అతడి నుంచి షాకింగ్ సమాధానం..

Woman: మహిళపై 12 మంది లైంగిక దాడి.. దారుణాన్ని భర్తకు చెప్పిన భార్య.. అతడి నుంచి షాకింగ్ సమాధానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మూడేళ్ల క్రితం పెళ్లయిన 24 ఏళ్ల మహిళకు.. వారి తల్లిదండ్రులు కట్నం సహా అన్నీ సమకూర్చారు. అత్తింటివాళ్లు అప్పట్లో అడిగినంత ఇచ్చారు.

  మహిళల అభ్యున్నతి, రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అయితే ఆ చట్టాలకు భయపడి వారి పట్ల వేధింపులు తగ్గుతున్న దాఖలాలు లేవు. రోజూ అనేక చోట్ల మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహితపై అత్తింటివాళ్ల నుంచి ఎదురైన వేధింపులు విని అంతా విస్తుపోయారు. మూడేళ్ల క్రితం పెళ్లయిన 24 ఏళ్ల మహిళకు.. వారి తల్లిదండ్రులు కట్నం సహా అన్నీ సమకూర్చారు. అత్తింటివాళ్లు అప్పట్లో అడిగినంత ఇచ్చారు. కానీ కట్నం విషయంలో వారి దాహం తీరలేదు. కొద్దిరోజుల క్రితం తమ కుమారుడికి ఖరీదైన కారు కావాలని ఇందుకోసం పుట్టింటి నుంచి రూ. 5 లక్షలు తీసుకురావాలని నిలదీశారు.

  అయితే ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో గర్భం దాల్చిన కోడలిపై అత్తింటివారు వేధింపులు మొదలుపెట్టారు. అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆమెకు అబార్షన్ జరిగిపోయింది. అయినా వారి వేధింపులు ఆగలేదు. మరింత పైశాచికతంగా బాధితురాలిని వేధించడం మొదలుపెట్టారు. వారి కుటుంబసభ్యులతో పాటు కుటుంబానికి చెందిన స్నేహితులు కూడా ఇందుకు సహకరించారు. అలా మొత్తం 12 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గతవారం ఈ ఘటన జరిగిందని ఆరోపించింది.

  ఈ విషయాన్ని తన భర్త దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పిన బాధితురాలు.. ఈ సందర్భంగా అతడి నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో కూడా తెలిపింది. తాము కోరిన అదనపు డబ్బు, కారును పుట్టింటి నుంచి తీసుకురావాలని.. లేకపోతే మళ్లీ ఇదే పునరావృతమవుతుందని తన భర్త చెప్పినట్టు ఆమె పోలీసులకు వెల్లడించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Harassment on women