కూతురికి ఉరివేసి చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. భార్యే కారణం

ఆ రోజు రాత్రే పాపను హోటల్ గది బాత్రూమ్‌లో ఉరివేసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకొని మరణించాడు.

news18-telugu
Updated: September 4, 2020, 2:16 PM IST
కూతురికి ఉరివేసి చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. భార్యే కారణం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కూతురికి ఉరివేసి చంపేశాడో తండ్రి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే పాపను చంపేసి, తానూ చనిపోయాడు. చిత్తూరు పట్టణంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ నగర్‌‌కు చెందిన గణేష్‌కు భార్య, ఓ పాప ఉన్నారు. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గణేష్.. ఆమెతో నిత్య గొడవపడేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి చిత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ రోజు రాత్రే పాపను హోటల్ గది బాత్రూమ్‌లో ఉరివేసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకొని మరణించాడు. ఉదయం హోటల్ సిబ్బంది వెళ్లి చూడగా.. ఇద్దరి శవాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 4, 2020, 2:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading