హోమ్ /వార్తలు /క్రైమ్ /

Electrician: ఎలక్ట్రీషియన్‌గా ఎన్నోసార్లు కరెంట్ షాక్‌ను తట్టుకున్నాడు.. కానీ భార్య ఇచ్చిన షాక్‌ను తట్టుకోలేక..

Electrician: ఎలక్ట్రీషియన్‌గా ఎన్నోసార్లు కరెంట్ షాక్‌ను తట్టుకున్నాడు.. కానీ భార్య ఇచ్చిన షాక్‌ను తట్టుకోలేక..

సుఖ్వీందర్ పిల్లలు, సుఖ్వీందర్

సుఖ్వీందర్ పిల్లలు, సుఖ్వీందర్

పెళ్లయిన తర్వాత పర స్త్రీ లేదా పర పురుషుడి మోజులో పడి కొందరు చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు మాత్రమే కాకుండా అభంశుభం తెలియని పిల్లలు జీవితాలు కూడా అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. అలాంటి విషాద ఘటనే హర్యానాలోని కర్నల్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...

హర్యానా: పెళ్లయిన తర్వాత పర స్త్రీ లేదా పర పురుషుడి మోజులో పడి కొందరు చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు మాత్రమే కాకుండా అభంశుభం తెలియని పిల్లలు జీవితాలు కూడా అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. అలాంటి విషాద ఘటనే హర్యానాలోని కర్నల్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం సుఖ్వీంద్రకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు ఆరేళ్ల పాప కాగా.. మరొకరు మూడేళ్ల వయసున్న బాబు. సుఖ్వీందర్‌, అతని భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సుఖ్వీందర్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఉన్నంతలో కుటుంబాన్ని సుఖంగా చూసుకునేవాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న సుఖ్వీందర్ జీవితం తన భార్య వంకర ఆలోచన కారణంగా నాశనమైంది. సుఖ్వీందర్ భార్య పక్కింటి వ్యక్తి మోజులో పడింది. ఇద్దరి మధ్య పరిచయం ఎంతవరకూ వెళ్లిందంటే.. పక్కింటి వ్యక్తి కోసం భర్తకు దూరమై అతనిని పెళ్లి చేసుకునేంత వరకూ వెళ్లింది. నెల రోజుల క్రితం పక్కింటి వ్యక్తిని సుఖ్వీందర్ భార్య పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

భర్త, పిల్లలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె చేసిన పనికి సుఖ్వీందర్ కుంగిపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో బాధపడుతుండేవాడు. ఇంటి వద్దే ఉంటూ కుమిలిపోయాడు. ఈ క్రమంలోనే.. క్షణికావేశంలో గత శనివారం ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. శనివారం రోజు పూర్తిగా ఇంటికే పరిమితమైన సుఖ్వీందర్ సాయంత్రం.. 4.30 గంటల సమయంలో నానమ్మ ఇంటి దగ్గర ఆడుకుంటున్న పిల్లలను తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. పిల్లలిద్దరికీ ఉరేసి.. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి:  Newly Married: పెళ్లయిన మూడు నెలలకే భర్తను ఇలా చూపించాల్సి వస్తుందని ఆమె ఊహించలేకపోయింది.. ఏం జరిగిందంటే..

సుఖ్వీందర్ కుటుంబం ఫిర్యాదుతో అతని భార్యపై, ఆమెను పెళ్లి చేసుకున్న పక్కింటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా సుఖ్వీందర్ ఎంతో మంచివాడని, ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదని.. అలాంటి వ్యక్తికి ఇలాంటి చావు రావడం ఏంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సుఖ్వీందర్, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. సుఖ్వీందర్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణమైన అతని భార్యను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కర్నల్ ఎస్పీ గంగారామ్ పూనియా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సుఖ్వీందర్ భార్యను, ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Family suicide, Haryana, Husband commits suicide

ఉత్తమ కథలు