హోమ్ /వార్తలు /crime /

Father: రోజురోజుకూ మనుషులు ఇలా తయారవుతున్నారేంటో.. కన్న కూతురిని ఈ కారణంతో హత్య చేసిన తండ్రివి నువ్వేనేమో..

Father: రోజురోజుకూ మనుషులు ఇలా తయారవుతున్నారేంటో.. కన్న కూతురిని ఈ కారణంతో హత్య చేసిన తండ్రివి నువ్వేనేమో..

పోలీసుల అదుపులో భల్లూ ప్రజాపతి

పోలీసుల అదుపులో భల్లూ ప్రజాపతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తన వివాహేతర సంబంధం గురించి కూతురు ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతో కన్న తండ్రే కడుపున పుట్టిన కుమార్తెను హతమార్చిన ఘటన ఝాన్సీ జిల్లా మౌరాణిపూర్ పరిధిలోని ధౌర్రా అనే గ్రామంలో కలకలం రేపింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు 24 గంటల వ్యవధిలో చేధించారు.

ఇంకా చదవండి ...

మౌరాణిపూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తన వివాహేతర సంబంధం గురించి కూతురు ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతో కన్న తండ్రే కడుపున పుట్టిన కుమార్తెను హతమార్చిన ఘటన ఝాన్సీ జిల్లా మౌరాణిపూర్ పరిధిలోని ధౌర్రా అనే గ్రామంలో కలకలం రేపింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు 24 గంటల వ్యవధిలో చేధించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ధౌర్రా గ్రామానికి చెందిన భల్లూ ప్రజాపతికి 13 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. అయితే.. భార్యకు తెలియకుండా మరో మహిళతో ఇతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో తన ప్రియురాలిని నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఆమెతో రాసలీలలు సాగించేవాడు. అలా ఒకరోజు ఇంట్లో భల్లూ, అతని ప్రియురాలు చనువుగా ఉన్న సమయంలో అతని కూతురు చూసింది. పక్కింటి వాళ్లు కూడా గమనించారు. ఈ విషయం ఆమె, పక్కింటి వాళ్లూ ఎక్కడ బయటపెడతారోనన్న భయంతో అప్పటి నుంచి భల్లూ మదనపడుతుండేవాడు. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలని భల్లూ మాస్టర్ ప్లాన్ వేశాడు.

కూతురిని చంపి.. ఆ నేరాన్ని పక్కింటి వాళ్లపై నెట్టేస్తే సమస్య తీరిపోతుందని భావించాడు. గత ఆదివారం అతని కూతురు బట్టలు ఉతికేందుకు కాలువకు వెళ్లింది. ఆమెను వెంబడిస్తూ తండ్రి కూడా వెళ్లాడు. ఆ తరువాత కొంతసేపటికి అతను ఇంటికి వెళ్లిపోయాడు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన బాలిక ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. అక్కడకు వెళ్లి వెతకగా ఆమె కనిపించలేదు. దీంతో.. భయంతో ఆ చుట్టుపక్కల చూశారు. ఎక్కడా కనిపించలేదు. ప్రమాదవశాత్తూ నీళ్లలో కొట్టుకుపోయిందేమోనని భావించేందుకు ఆ కాలువ అంత లోతైనదేమీ కాదు. ఎంత వెతికినా ఆ బాలిక కనిపించలేదు. ఆమె తండ్రి కూడా కుటుంబ సభ్యులతో కలిసి కూతురి కోసం వెతుకులాట సాగించాడు.

ఇది కూడా చదవండి: Gym Trainer: కుర్రాడితో ఆంటీ అఫైర్.. ఫొటోలతో బయటపడిన పచ్చి నిజాలు.. ఆ ఫొటోలు మీరూ చూడండి..

అంతేకాకుండా.. తన కూతురిని పొరుగింటి వారే చంపేశారంటూ కేసు పెట్టాడు. పోలీసులకు కేసు విచారణలో భాగంగా బాలిక తండ్రిని కూడా విచారించారు. అతని తీరుపై పోలీసులకు అనుమానమొచ్చింది. తమదైన శైలిలో విచారించగా కూతురిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. స్పాట్‌కు చేరుకుని పోలీసులు పరిశీలించగా బాలిక మృతదేహం కనిపించింది. తన వివాహేతర సంబంధం గురించి బయటపెడుతుందేమోనన్న భయంతోనే ఆమెను హత్య చేసినట్లు భల్లూ ప్రజాపతి పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కూతురిని గొడ్డలితో గొంతు నరికి హత్య చేసిన కిరాతక తండ్రిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Father, Love affair, Uttar pradesh

ఉత్తమ కథలు