FATHER HAD BEEN SEXUALLY HARASSING HIS TWO DAUGHTERS IN TAMILNADU SSR
Father: ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు కూతుళ్లు.. ఒకరికి 18 ఏళ్లు.. మరొకరికి 16 ఏళ్లు.. తండ్రే ఇలా చేస్తే..
ప్రతీకాత్మక చిత్రం
కేలంబాక్కం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కొడుకు వయసు 21 కాగా.. ఒక కుమార్తె వయసు 18, మరో కుమార్తె వయసు 16 సంవత్సరాలు. ఈ 54 ఏళ్ల వ్యక్తి మాంత్రికుడిగా ఊళ్లో మాయలుమంత్రాలతో పబ్బం గడుపుకునేవాడు. భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు.
చెన్నై: సమాజంలో కొందరు మగాళ్లు మృగాళ్లుగా మారి వావివరసలు మరచి పశువుల్లా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. ఐదు పదుల వయసులో కన్న కూతుళ్లతోనే ఓ తండ్రి కామాంధుడిగా మారి ఆ బంధానికి మాయని మచ్చ తెచ్చాడు. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కూతుళ్ల పైనే కన్నేసి నీచంగా ప్రవర్తించాడు. ఆ తండ్రి లైంగిక వేధింపులు భరించలేకపోయిన ఆ ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కేలంబాక్కం పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేలంబాక్కం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కొడుకు వయసు 21 కాగా.. ఒక కుమార్తె వయసు 18, మరో కుమార్తె వయసు 16 సంవత్సరాలు. ఈ 54 ఏళ్ల వ్యక్తి మాంత్రికుడిగా ఊళ్లో మాయలుమంత్రాలతో పబ్బం గడుపుకునేవాడు. భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో.. అతని వేధింపులు తాళలేక అతని భార్య పిల్లలతో సహా మూడేళ్ల క్రితం బంధువు ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.
ఇటీవల.. తన భార్య పిల్లలను వెతుక్కుంటూ ఈ వ్యక్తి వెళ్లడంతో బంధువులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న ఈ 54 ఏళ్ల వృద్ధుడు దారి తప్పాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తిలోని కామాంధుడు నిద్రలేచాడు. నిద్రిస్తున్న కూతుర్ల దగ్గరకు వెళ్లాడు. ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తండ్రి చర్యతో ఒక్కసారిగా షాక్కు లోనైన పెద్ద కుమార్తె కర్ర తీసుకుని అతనిని చితక్కొటింది. భర్త చేసిన నీచపు పనితో అతని భార్య పిల్లలను వెంటబెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే.. భార్య, కూతుర్లు తనపై పోలీసులకు ఎక్కడ ఫిర్యాదు చేస్తారోనన్న భయంతో స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకుతో కలిసి పెద్ద కూతురు తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు అతని కొడుకును అరెస్ట్ చేశారు. అతని పెద్ద కూతురిపై కూడా కేసు నమోదు చేశారు. తప్పు చేసిందే కాకుండా తనపై కేసు పెట్టడాన్ని సహించలేకపోయిన అతని పెద్ద కూతురు చెల్లిని వెంటబెట్టుకుని జరిగిన దారుణం గురించి పోలీసులకు వివరించింది. పోలీసుల విచారణలో ఆ వృద్ధుడు ఆ ఇద్దరు యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.