Home /News /crime /

FATHER DIED WITH SON LOVE AFFAIR IN NALGONDA VB

Man suicide: ఓ ప్రేమ వ్యవహారం.. ప్రేమికుడి ఇంటిపై రాళ్ల దాడి.. యువకుడి తండ్రి మరణం.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man suicide: ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడని.. దీంతో తమ పరువు పోయిందని యువతి బంధువులు యువకుడి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. దీంతో యువకుడి తండ్రి చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో చోటుచేసుకుంది.

    కొన్ని సంవత్సరాల వరకు పరువు హత్యలు చూశాం కానీ ప్రస్తుతం పరువు పోతుందని కొందరు.. పరువు పోతుందేమోనని మరి కొందరు ఆత్మహత్యలకు, దాడులకు పాల్పడుతున్నారు. ఈ మధ్యన తన కూతరుకు పెళ్లి నిశ్చయించిన తర్వాత కూడా వేరే వ్యక్తితో పోయిందని కానిస్టేబుల్ దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పలడ్డారు. ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన. నల్గొండ జల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో  ప్రేమించిన అమ్మాయిని  ఓ యువకుడు తీకెళ్లాడని.. తమ పరువు పోయిందని భావించిన యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటిపై రాళ్ల దాడి చేయగా యువకుడి తండ్రి చనిపోయాడు.  అతని చావుకు  కారణం యువతి బంధువులేనని యువకుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామానికి చెందిన దేవదానం, జ్యోతి దంపతులు. వారికి ఒక కుమారుడు శ్రీకాంత్ (20) ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి(19) గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి ప్రేమను తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకోరనే కారణంగా ఇద్దరు ఈ నెల 19న గ్రామం నుంచి వెళ్లిపోయారు.

    తన కూతురుని మీ అబ్బాయి మయ మాటలు చెప్పి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ.. పరువు పోయిందనే కారణంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు శ్రీకాంత్ ఇంటిపై రాళ్ల దాడి యత్నించారు. ఆ  దాడిలో  శ్రీకాంత్ తండ్రి దేవదానం మరణించాడు. యువతి బంధువులు దేవదానంపై దాడి చేయడంతోనే మరణించాడని శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి, చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

    ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. యువ‌తి బంధులు దాడిచేయ‌డంతో దేవ‌దానం చ‌నిపోయాడ‌ని అత‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. అయితే గ్రామం నుంచి వెళ్లిపోయిన శ్రీకాంత్, యువతి జరిగిన విషయం తెలుసుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం.
    Published by:Veera Babu
    First published:

    Tags: Attack stones, Attempt to suicide, Crime, Crime news, Father died, Telangana crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు