హోమ్ /వార్తలు /క్రైమ్ /

Nalgonda: అయ్యో ఎంతటి విషాదం.. తండ్రి చావును కోరిన కొడుకు ప్రేమ.. ఏమైందంటే..?

Nalgonda: అయ్యో ఎంతటి విషాదం.. తండ్రి చావును కోరిన కొడుకు ప్రేమ.. ఏమైందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నల్గొండలో ఇరువురు మైనర్లు చేసిన పనితో రెండు కుటుంబాలు కొట్టుకునే స్థాయికి వచ్చింది. చివరికి ఓ ప్రాణాన్నే బలి తీసుకుంది. 

ఈ రోజుల్లో పాఠశాలల్లోనే అమ్మాయి, అబ్బాయిలు ప్రేమించుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది. వారి కుటుంబ పరిస్థితిని గానీ.. తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు గానీ లెక్కచేయకుండా తెలిసీ తెలియని వయసులో మైనర్లు తప్పులు చేస్తున్నారు. ఇలాంటి తప్పిదాలే వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఇలాంటి ఘటనే నల్గొండలో (Nalgonda) జరిగింది. ఇరువురు మైనర్లు చేసిన పనితో రెండు కుటుంబాలు కొట్టుకునే స్థాయికి వచ్చింది. ఓ ప్రాణాన్నే బలి తీసుకుంది.  నల్గొండ జిల్లా డిండికి చెందిన మాధమోని కృష్ణయ్య (38), సైదమ్మ దంప తులకు కుమారుడు సాయి, ఇద్దరు కుమార్తెలు. సాయి చేపలవేట సాగిస్తూ ఆర్నెల్లుగా తల్లిదం డ్రులకు దూరంగా నాయనమ్మతో కలిసి ఉంటు న్నాడు. సాయి (sai) అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ చదువుతోన్న బాలికను మూడేళ్లుగా ప్రేమిస్తు న్నాడు.

 ఇంట్లో నుంచి రెండు సార్లు పారిపోయి..

సాయి ప్రియురాలైన బాలికకు (sai girlfriend) ఇంట్లో పెళ్లి సం బంధాలు చూస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. దీంతో ఏప్రిల్‌ చివరి వారంలో సాయి,  సదరు బాలిక కలిసి శ్రీశైలం పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు వారిద్దరినీ డిండికి తీసుకొచ్చి కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి.. ఇలాంటిది పునరావృతం కావొద్దని సర్ది చెప్పారు. అయితే బాలికకు మే 3న నిశ్చితార్థం (Engagement) చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. భరించలేని సాయి, సదరు బాలిక మే 2న రాత్రి మళ్లీ ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో సాయిపై బాలిక తల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

ఆచూకీ చెప్పాలని ఒత్తిడి..

పారిపోయిన ఇద్దరు తమ సెల్‌ఫోన్‌లు ఇంట్లోనే వదిలి వెళ్లడంతో పోలీసులకు వారిని గుర్తించటం  కష్టంగా మారింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేసి నెలరోజులు దాటినా తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టడం లేదని బాలిక తల్లి తన బంధువులతో కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో కృష్ణయ్య, సైదమ్మ దంపతులను ప్రతీరోజు స్టేషన్‌కు పిలిపించి తమ కొడుకు ఆచూకీ చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు.

కొడుకు జాడ తెలియక, మరోవైపు బాలిక తల్లి బంధువుల సూటిపోటిమాటలు, పోలీ సుల ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణయ్య శనివారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Suicide) ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కృష్ణయ్య ను నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు. కృష్ణయ్య మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక తల్లిపై, వారి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి, బంధువుల వేధింపులతో పాటు పోలీసుల ఒత్తిడి కారణంగానే కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే పనిలో ఉన్నారు.

First published:

Tags: Minor, Nalgonda, Suicide

ఉత్తమ కథలు