తెలంగాణలో కరోనా కష్టాలకు తండ్రీకూతురు ఆత్మహత్య..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా కొద్దికాలంగా పని లేక అక్బర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.

  • Share this:
    (ఎం. మహేందర్, న్యూస్‌18 ప్రతినిధి) 

    కరోనా మహమ్మారి పేదింటి ప్రజలకు ఆర్థిక కష్టాలు తెచ్చిపెడుతోంది. నిత్యం చిన్న చిన్న పనులు చేసుకునే వారి బ్రతుకులు కరోనా వల్ల చితికి పోయాయి. ఆర్థిక భారం భరించలేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కుటుంబ ఆర్థిక పరిస్థితి తండ్రి కూతుళ్లు ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనిలో తండ్రి కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాలనీలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గోసంగి కాలానికి చెందిన అక్బర్ గతంలో రోడ్లపై మహిళలకు సంబంధించిన రబ్బర్ బ్యాండ్, పిన్నీసులు అమ్ముకునేవాడు. గత 10 సంవత్సరాల క్రితం అక్బర్ భార్య చనిపోయింది. కరోనా కారణంగా కొద్దికాలంగా పని లేక అక్బర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. కాలనీలో ఉన్న గుడిసెలో తండ్రి కూతురు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసాయి. దాంతో 14 సంవత్సరాల కూతురు సైరా బేగంకు ధమ్సప్ లో పురుగుల మందు కలిపి తగించాడు అక్బర్. తర్వాత అదే ఇంట్లో అక్బర్ ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన కాలనీలో విషాదాన్ని నింపింది.
    ఘటనా స్థలాన్ని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు. ఇరుగుపొరుగు వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: