విషాదం.. మహిళ కామవాంఛకు భర్త, కూతురు బలి..

ఈ నెల 2న అనూష ఇంటికి కత్తి తీసుకొని వెళ్ళాడు. పడక గదిలో రాజశేఖర్, అనూష ఉన్నట్లు గుర్తించి బయటికి రావాలని కేకలు వేశాడు. ఇద్దరూ బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న అనూష కూతురు ఆద్యను చంపేస్తానని బెదిరించాడు.

news18-telugu
Updated: July 12, 2020, 7:18 AM IST
విషాదం.. మహిళ కామవాంఛకు భర్త, కూతురు బలి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ మహిళ కామవాంఛకు రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. క్షణికానందం కోసం ఆ మహిళ తొక్కిన అడ్డదారుల ఫలితంగా ఆ కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది. ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడి పరిచయం అయ్యింది. సోషల్​ మీడియా పరిచయం హద్దులు దాటి వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతటితో ఆగకుండా ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి రోజూ ఇంటికి వచ్చిపోయే క్రమంలో తన స్నేహితుడిని వెంట తీసుకొచ్చాడు. ఆ మహిళ అతడిపైనా కన్నేసింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తిని వదిలేసి.. అతడి స్నేహితుడి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఇది తెలుసుకున్న ఫేస్‌బుక్ స్నేహితుడు ఆగ్రహించాడు. ఆ ఫలితంగా అభం శుభం తెలియని ఐదేళ్ల కూతురు హత్యకు గురయ్యింది. ఈ విషయం తెలిసిన మహిళ భర్త.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అడ్డదారులు తొక్కడం.. ఫలితంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు హత్యకు గురికావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

కూతురు చనిపోయిన వారం తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష.. 2011లో హైదరాబాద్​కు వచ్చింది. గ్రూప్2లో ఉద్యోగం కోసం శిక్షణా సంస్థలో చేరింది. అదే శిక్షణా సంస్థలో భువనగిరికి చెందిన కల్యాణ్ రావు చేరాడు. ఇద్దరి మధ్య కలిగిన పరిచయం ప్రేమగా మారడంతో... 2012లో పెళ్లి చేసుకున్నారు. కల్యాణ్ రావు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరులో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఆద్య(5) కూతురు ఉంది. పాప చదువు కోసం కల్యాణ్​ రావు ఘాట్​కేసర్ పీఎస్ పరిధిలోని ఐకె గూడలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఇక్కడి నుంచే ఆత్మకూరుకు విధులకు వెళ్లి వచ్చేవాడు.

కొంపముంచిన ఫేస్‌బుక్ స్నేహం..
రెండేళ్ల క్రితం అనూషకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వాణిజ్య సంస్థలో పనిచేస్తున్న కరుణాకర్​తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కరుణాకర్ తన స్నేహితుడు రాజశేఖర్​ను అనూషకు పరిచయం చేశాడు. ఆ తర్వాత అనూష కరుణాకర్​ను వదిలిపెట్టి రాజశేఖర్​తో పరిచయం పెంచుకుంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అనూష దూరం పెట్టడం వల్ల అనుమానం పెంచుకున్న కరుణాకర్ ఆమెపై నిఘా పెట్టాడు. రాజశేఖర్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు నిర్ధారించుకుని అతడిని హతమార్చేందుకు కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 2న అనూష ఇంటికి కత్తి తీసుకొని వెళ్ళాడు. పడక గదిలో రాజశేఖర్, అనూష ఉన్నట్లు గుర్తించి బయటికి రావాలని కేకలు వేశాడు. ఇద్దరూ బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న అనూష కూతురు ఆద్యను చంపేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ తలుపులు తీయకపోవడంతో ఉన్మాదిలా మారిన కరుణాకర్.. చిన్నారి ఆద్య గొంతుకోశాడు.

ఆద్య కేకలు వేయడంతో తలుపు తీసి బయటకు వచ్చిన అనూష సొమ్మసిల్లి పడిపోయింది. గదిలోనుంచి పారిపోతున్న రాజశేఖర్ పైన కరుణాకర్​ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. రాజశేఖర్ తప్పించుకు పోవడంతో అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని, అనూషను ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయాలపాలైన నిందితుడు కరుణాకర్​ను ఘట్​కేసర్​ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న అనంతరం ఈ నెల 7న అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అయితే పాపా చనిపోయినప్పటి నుంచి భార్య అనూష, భర్త కల్యాణ్​రావు ఇద్దరు భువనగిరిలోనే ఉంటున్నారు.

శనివారం కల్యాణ్​ తన భార్య, డ్రైవర్​తో కలిసి హైదరాబాద్​ వెళ్లారు. భార్య అనూషను అక్కడి దింపి... డ్రైవర్​తో పాటు తిరుగుప్రయాణమయ్యాడు. కళ్యాణ్ తాను ఆఫీసుకు వెళ్తున్నానని, ఇంటి వద్ద కారు పార్క్​ చేయమని డ్రైవర్​కు చెప్పాడు. అనంతరం కళ్యాణ్ భువనగిరి పట్టణంలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబసభ్యుల వేదనకు అంతులేకుండా పోయింది. అనూష క్షణికానందం కోసం వెంపర్లాడి పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేసుకుంది.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading