Home /News /crime /

FATHER AND SONS GANG RAPED THE NINTH CLASS GIRL STUDENT IN PANIPAT DETAILS HERE VB

Minor: రాత్రి తండ్రి, పగలు కొడుకులు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కుటుంబసభ్యులు.. ఆ ఇంటి ఇల్లాలు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ తండ్రి అతని ఇద్దరు కుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి.. ఆపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. రెండు నెలలపాటు తనను అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఘటన సమాజం తలదించుకునే విధంగా ఉంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ తండ్రి అతని ఇద్దరు కుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు.

  Sadist: నిశ్చితార్థాన్ని అడ్డం పెట్టుకున్నాడు.. కాబోయే భార్యతో అతడు ఏం చేశాడో తెలుసా.. ముగింపు ఊహించలేరు..


  మత్తుమందు ఇచ్చి.. ఆపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. రెండు నెలలపాటు తనను అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్టుటో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని పానిపట్ ​లోని మోడల్​ టౌన్​లో కుటుంబ సభ్యులతో ఆ బాధితురాలు నివసిస్తుంది. తన ఇంటిపక్కనే ఉంటున్న అజయ్​ అనే యువకుడు.. ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. ఆ మాటలు ఆ బాలిక మొదట ఒప్పుకోలేదు. బలవంతంగా ఒప్పించాడు. ఇలా ఆమె అతడి ప్రేమలో పడిపోయింది. ఓ రోజు ఆ బాలికను అజయ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్ల ఇంట్లో అతడి సోదరుడు, తండ్రి ఉన్నారు. మొదట ఆ బాలిక భయపడిపోయింది.

  Very Sad: పొలంలో కూలీ పనులు చేస్తున్న మహిళ.. ఏం చేస్తున్నావ్ అంటూ.. వెనుక నుంచి వచ్చిన భూ యజమాని.. ఒక్కసారిగా..


  తర్వాత అజయ్ ఆమెకు ధైర్యం చెప్పి.. ఏం కాదు భయపడకు అంటూ ఆమెకు ధైర్యం చెప్పి ఇంట్లోనే కూర్చొబెట్టాడు. కొద్ది సమయం తర్వాత అజయ్ తండ్రి సదర్, అజయ్ సోదరుడు అర్జున్.. ఆ బాలికకు మత్తుమందుతో కూడిన సిగరెట్ కాల్చమని బలవంతం చేశారు. తనకు అలావాటు లేదని చెప్పినా.. ఆమె ప్రతిఘటిస్తున్నా.. ఆమెకు సిగరెట్ ఇచ్చి కాల్చమని బెదిరించారు. అప్పటికే ఆ బాలికకు బయం మొదలైంది. తాను అజయ్ ను ఇష్టపడుతున్నానని.. అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అజయ్ తండ్రి ఒప్పుకున్నాడు. తర్వాత ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పగలు ఒకరు, రాత్రి మరొకరు అంటూ వాళ్లు సమయాన్ని పంచుకొని.. ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. ఇలా ఆ బాలికను బయటకు పంపించకుండా.. రహస్యంగా ఇంట్లోనే ఉంచారు. ఓ వైపు తన కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తుందిలే అని.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.

  Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


  ఇలా ఎన్ని సార్లు అడిగినా వాళ్లు పట్టించుకోలేదు. రెండు నెలల పాటు బాలికను వాళ్లు ఇంట్లోనే బంధించి రాక్షసంగా కామ వాంఛ తీర్చుకున్నారు. ఇలా ఆమెకు డ్రగ్స్ ను అలవాటు చేశారు. మానసికంగా, శారీరకంగా ఆమెకు అక్కడ ఏం జరుగుతుంతో తెలియని పరిస్థితికి వచ్చింది. అయితే ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న బాధితురాలు.. విషయాన్ని తల్లికి చెప్పింది. ఈ విషయం తెలిపిన వెంటనే ఆ బాధితురాలు అక్కడిక్కడే పడిపోయింది. దీంతో పోలీసులుకు ఆ తల్లి ఫిర్యాదు చేసింది. రెండు నెలల పాటు ఆమెపై అత్యాచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి పోలీసులకు చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తు.. నా కూతురు జరిగిన విషయాన్ని పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని.. కనీసం ఆమెకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించలేదని వాపోయింది.

  Extramarital Affair: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తెలుసుకున్న భార్య ఏం చేసిందో చూడండి..


  దీంతో సీఎం నివాసానికి వెళ్లారు తల్లీకూతుళ్లు. తమ గోడు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన సీఎం తక్షణమే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి.. అజయ్​, అర్జున్​, సదర్​, అజయ్​ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇంత దారుణం జరుగుతున్నా ఇంట్లోనే ఉన్న అజయ్ తల్లి పట్టించుకోలేదు. చూస్తూ ఊరుకుందే కానీ.. ఇది తప్పు అని చెప్పలేదు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు