ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కొడుకులు బైకు మీద వెళుతుండగా..

బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని సల్మాన్‌పురం వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరూ లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయ్యారు.

news18-telugu
Updated: July 17, 2020, 11:00 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కొడుకులు బైకు మీద వెళుతుండగా..
లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన తండ్రికొడుకులు
  • Share this:
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటివరకు తండ్రి కొడుకులు ఆనందంగా మాట్లాడుకుంటూ ఒకే ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. కానీ వారిని చూసి విధికి కన్నుకుట్టినట్టయ్యింది. రోడ్డు ప్రమాద రూపంలో వారిని మృత్యువు కబళించింది. తండ్రికొడుకులిద్దరూ లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు ద్విచక్ర వాహనం మీద ఏదో పని నిమిత్తం వెళుతున్నారు. అప్పటివరకు ఆనందంగా పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ వారి ప్రయాణం సాగుతోంది. కొడుకు చెబుతున్న మాటలను తండ్రి శ్రద్ధగా వింటున్నాడు. కానీ వారి పట్ల విధికి కన్నుకుట్టినట్టు అయ్యింది. బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని సల్మాన్‌పురం వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరూ లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయ్యారు. తండ్రి కొడుకులిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 17, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading