వివాహేతర సంబంధం.. నిజం తెలిసి అవమానంతో చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రీ కొడుకులు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం (Photo Courtesy: YouTube)

సుబ్రమణి అనే 55 ఏళ్ల వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి 25 ఏళ్ల శంకర్, 21 ఏళ్ల కృష్ణన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు ముగ్గురు ఉపాధి నిమిత్తం నామక్కల్ జిల్లా ముత్తుకాపట్టికి వచ్చారు. అక్కడ..

 • Share this:
  వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాక వల్ల కుటుంబాలు నాశనమయిపోతున్నాయి. భార్యను భర్త చంపేయడమో, భార్యే ప్రియుడి సాయంతో భర్తను చంపేయడానికి చెందిన ఘటనలు రోజూ ఎక్కడో ఓ మూల జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన వివాహేతర సంబంధాల వల్ల కేవలం భార్యాభర్తలే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి నష్టాన్ని తెస్తోందో తెలియజేస్తోంది. ఒక్క వివాహేతర సంబంధం వల్ల తండ్రీకొడుకులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. నేరం వారిది కాకున్నా, వారి తప్పేమీ లేకున్నా ప్రాణాలు తీసుకున్నారు. వారి ఇంట్లో ఓ వ్యక్తి చేసిన తప్పునకు వారు శిక్షను అనుభవించారు. తమిళనాడులోని టీ.నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా మల్లూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే 55 ఏళ్ల వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి 25 ఏళ్ల శంకర్, 21 ఏళ్ల కృష్ణన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు ముగ్గురు ఉపాధి నిమిత్తం నామక్కల్ జిల్లా ముత్తుకాపట్టికి వచ్చారు. అక్కడ ఓ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఇటుకబట్టిలో కొల్లంపట్టికి చెందిన భాస్కర్ తన భార్య సత్యతో పాటు పనిచేయడానికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే సుబ్రమణి చిన్న కుమారుడు కృష్ణన్ కు, భాస్కర్ భార్య సత్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
  ఇది కూడా చదవండి: పెళ్లి కాని అమ్మాయిలే అతడి టార్గెట్.. అందమైన అబ్బాయిల ఫొటోలతో వల.. హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి..!

  15 రోజుల క్రితం సత్య, కృష్ణన్ ఇళ్ల నుంచి పారిపోయారు. ఈ విషయం తెలిసి భాస్కర్ పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు విచారణ నిమిత్తం తరచూ సుబ్రమణిని, అతడి పెద్ద కుమారుడు శంకర్ ను పిలుస్తుండటంతో అవమానంగా భావించారు. తమ పరువు పోతోందని ఇద్దరూ ఆవేదన చెందారు. దీంతో వీరిద్దరూ శుక్రవారం ఓ చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. వీరి మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న కొడుకు చేసిన నిర్వాకం వల్ల తండ్రీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం ఆ ప్రాంత వాసులను కలచివేసింది.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..
  Published by:Hasaan Kandula
  First published: