Home /News /crime /

FATHER AND DAUGHTER COMMITTED SUICIDE IN VIJAYAWADA SU

Vijayawada: ఇంట్లోనే తండ్రి, కూతురు ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్‌ నోట్‌..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి, కూతురు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

    ఓ తండ్రి తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలోగల శ్రీనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో భర్త జగాని రవి (40), తన పదేళ్ల కుమార్తెతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో రవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. అయితే గత కొంతకాలంగా రవి భార్య భరణి కిడ్నీ సంబంధిత వ్యాధిత బాధపడుతుంది. ఓ వైపు భార్య అనారోగ్యం, మరోవైపు ఇటీవలే తాను ఎంతగానో ఇష్టపడ నాన్నమ్మ మృతిచెందడంతో.. రవి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే రవి, అతని కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీవారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    ఇక, ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ మాత్రం కన్నీరు పెట్టించేలా ఉంది. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రవి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మరణించిన తర్వాత తమ అవయవాలను భార్య భరణికి ఇవ్వాలని అందులో కోరాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

    Vakeel Saab: పవన్ కల్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య ఫైట్.. వకీల్ సాబ్ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో యువకుల వీరంగం..!

    అయితే.. మృతుడి కాళ్లు, చేతులు కట్టేయడం, నోటికి టేప్‌ వేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవి, అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా వారిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Suicide, Vijayawada

    తదుపరి వార్తలు