హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్య డబ్బులు పంపడం లేదని... పిల్లల్ని చావగొట్టిన కన్నతండ్రి

భార్య డబ్బులు పంపడం లేదని... పిల్లల్ని చావగొట్టిన కన్నతండ్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెల్టు, సెల్ ఫోన్ వైర్లతో చిన్నారుల్ని చావగొట్టాడు. పాపం అభం శుభం తెలియని ఆ పసివాళ్లు... కన్నతండ్రే తమను దారుణంగా కొట్టిన దెబ్బలకు చిగురుటాలకుల్లా వణికిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. దుబాయ్‌లో ఉంటున్న భార్య  డబ్బులు పంపండం లేదని కన్నతండ్రే పిల్లల్ని చావాబాదాడు. బెల్టు, వైర్లతో దాడికి దిగాడు. కన్న పిల్లలని చూడకుండా దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత దీన్ని వీడియో తీసి భార్యకు పంపాడు. నువ్వు డబ్బులు పంపకుంటే పిల్లల్ని ఇలాగే హింసిస్తానంటూ బెదిరించాడు. దీంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. నర్సాపురం మండలం సారవలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలీషా భార్య పొట్టకూటీ కోసం విదేశాలకు వెళ్లింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. పిల్లల్ని తండ్రి దగ్గర వదిలి వెళ్లి నెలనెలా డబ్బులు పంపించేది. అయితే తాను పంపిస్తున్న డబ్బును భర్త దుబారా ఖర్చులు చేయడంతో... డబ్బులు పంపడం మానేసింది.

దీంతో భార్యపై కక్ష పెంచుకున్న ఎలీషా..పిల్లలపై తన ప్రతాపం చూపించాడు. బెల్టు, సెల్ ఫోన్ వైర్లతో చిన్నారుల్ని చావగొట్టాడు. పాపం తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారులు చిగురుటాలకుల్లా వణికిపోయారు. అంతేకాకుుండా నువ్వు డబ్బులు పంపకపోతే పిల్లల్ని ఇలాగే టార్చర్ పెడతానంటూ భార్యకు పిల్లల్ని చావగొట్టని వీడియో పంపాడు. చిన్నారుల్ని దారుణంగా తండ్రి కొడుతున్న తీరును చూసి సోషల్ మీడియలో జనం మండిపడుతున్నారు. వీడేం తండ్రి... పిల్లల్ని ఇలా చావగొడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తండ్రి ఎలీషాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Children, Crime news, Save Girl Child, West Godavari

ఉత్తమ కథలు