కూతురును లైంగిక వేధింపులకు గురిచేసిన తండ్రికి 5 ఏళ్ల జైలుశిక్ష...

లింగం కుమార్ భార్య పదేళ్ల క్రితం మరణించడంతో కూతురు, కుమారుడితో కలిసి అదే ప్రాంతంలో జీవిస్తున్నాడు. అయితే పశువాంఛతో రెండేళ్ల నుంచి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిని భరించలేక బాలిక వారి బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.

news18-telugu
Updated: August 23, 2019, 10:46 PM IST
కూతురును లైంగిక వేధింపులకు గురిచేసిన తండ్రికి 5 ఏళ్ల జైలుశిక్ష...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్నకూతురిని లైంగికంగా వేధించిన ఓ కామాంధుడికి ఎల్‌బి నగర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ భార్య పదేళ్ల క్రితం మరణించడంతో కూతురు, కుమారుడితో కలిసి అదే ప్రాంతంలో జీవిస్తున్నాడు. అయితే పశువాంఛతో రెండేళ్ల నుంచి కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిని భరించలేక బాలిక వారి బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. రాఖీ పండగకు సోదరుడికి రాఖీ కట్టేందుకు రాగా లింగం కుమార్ మరోసారి కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. తిరిగి వెళ్లిన తర్వాత బాలిక తను చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆమె డిసిపియూ వారి దృష్టికి తీసుకువెళ్లింది.

కాగా ఈ ఘటనతో బాలిక జూలై 12, 2014న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చారు. కోర్టులో ఛార్జ్‌షీట్ వేయగా తుది సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు, 5,000 రూపాయల జరిమానా విధించింది.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు