రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగిపోతున్నాయి. అతివేగం (Speed Driving), మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, రాంగ్ రూట్, మంచు ప్రభావంతో రోడ్డు కనపడకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. అయితే జరిగే ప్రమాదం ఒకటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో బాధిత కుటుంబాల్లో తీరని దుఃఖం చోటు చేసుకుంటుంది. ఇక తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
బాపట్ల (Bapatla) జిల్లా వేమూరు మండలం జంపని వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా..మరో 19 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మొన్న చిత్తూరులో ప్రమాదం..
మొన్న చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన విజయ్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు బస్సు బెంగళూరు నుండి విజయవాడకు బయలుదేరింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పలమనేడు వద్దకు రాగానే బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను డీకోట్టింది. దీనితో బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో చూసేలోపే ప్రమాదం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో గుంటూరుకు చెందిన విజయ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడిఅక్కడే మృతి చెందాడు. అలాగే బస్సులో ఉన్న మరికొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు తేలుస్తుంది.
ప్రమాదానికి కారణం అదేనా..
అయితే అప్పటివరకు అప్రమత్తంగానే డ్రైవింగ్ చేసిన డ్రైవర్ కొద్దిసేపటికి నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు. కనురెప్పపాటులోనే బస్సు పక్కనే ఉన్న డివైడర్ ను ఢికొట్టింది. అప్పుడు నిద్ర నుండి తేరుకున్న లాభం లేకపోయింది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇవాళ జరిగిన ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Ap, AP News, Road accident