HOME »NEWS »CRIME »fastest trials and delivery death penalty in record 23 days in ghaziabad hsn

దేశంలోనే సంచలనం.. 23 రోజుల్లోనే ఉరి శిక్ష ఖరారు.. ఇంతకీ ఆ నేరస్థుడు చేసిన నీచమేంటంటే..

దేశంలోనే సంచలనం.. 23 రోజుల్లోనే ఉరి శిక్ష ఖరారు.. ఇంతకీ ఆ నేరస్థుడు చేసిన నీచమేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

వంద మంది నేరస్థులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదన్నది భారతీయ న్యాయసూత్రం. అందుకే నేరస్థులకు శిక్షలు ఖరారు చేయడంలో కాస్త జాప్యం జరుగుతుంటుంది. అయితే ఓ కేసులో కేవలం 23 రోజుల్లోనే ఫోక్సో కోర్టు శిక్షను ఖరారు చేసింది.

  • Share this:
    ’ఈ నేరాన్ని మేమే చేశామని ధైర్యంగా ఒప్పుకుంటున్నాం.. 24 గంటల్లో మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా‘.. ఇదీ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్. వంద మంది నేరస్థులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదన్నది భారతీయ న్యాయసూత్రం. అందుకే నేరస్థులకు శిక్షలు ఖరారు చేయడం, వాటిని అమలు చేయడంలో కాస్త జాప్యం జరుగుతుంటుంది. కరుడుగట్టిన నేరస్థులకు శిక్ష విధించాలన్నా ఏళ్ల తరబడి సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. కేవలం 23 రోజుల్లోనే ఓ నేరాన్ని నిరూపించడం, ఆ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఉరి శిక్షను ఖరారు చేయడం జరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని కవీనగర్ ప్రాంతంలో ఓ రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అంతేకాకుండా ఆ బాలిక ప్రాణాలను కూడా ఆ కీచకుడు తీసేశాడు. 2020వ సంవత్సరం అక్టోబర్ 21న ఈ విషాధ ఘటన జరిగింది. తన కూతుర్ని ఎవరో అత్యాచారం చేసి చంపేశారని తెలిసి ఆ బాలిక తండ్రి వెంటనే ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న ఘజియాబాద్ పోలీసులు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ కేసులో నిందితుడెవరన్నతి తేల్చారు. బాలిక తండ్రి స్నేహితుడే ఈ దురాగతానికి పాల్పడ్డాడని విచారణలో పోలీసులు తేల్చారు.



    దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఫోక్సో కోర్టులో హాజరుపరిచారు. గతేడాది డిసెంబర్ 29న కోర్టులో ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు సబ్మిట్ చేశారు. కేసు తీవ్రతను బట్టి ఫోక్సో కోర్టు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిందితుడు కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు కూడా దొరికాయి. మొత్తానికి ఫోక్సో కోర్టులో అతడిని హాజరు పరిచిన సరిగ్గా 23 రోజులకు, బుధవారం నాడు ఫోక్సో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. అతడికి మరణశిక్షను విధిస్తూ ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. దేశంలోనే అత్యంత వేగంగా విచారణ జరిగి, శిక్ష కూడా ఖరారు కేసుల జాబితాలో ఇది కూడా రికార్డులకెక్కింది.
    Published by:Hasaan Kandula
    First published:January 21, 2021, 09:45 IST