Home /News /crime /

FARMER THREATENS TAHSILDAR PETROL BOTTLE IN KHAMMAM MS

పట్టా చేయకపోతే చంపుతా.. తహశీల్దార్ ఆఫీస్‌కి పెట్రోల్‌తో వచ్చిన రైతు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పట్టా చేయకపోతే చంపుతానని బెదిరించాడు. అతని సంచిలో పెట్రోల్ బాటిల్ ఉండటంతో తహశీల్దార్ భయపడిపోయారు.పోలీసులకు సమాచారం అందించడంతో అతన్నిఅదుపులోకి తీసుకున్నారు.

    ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం కలకలం రేగింది.తన 12 గుంటల భూమిని పట్టా చేయకపోతే చంపేస్తానని ఓ రైతు తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంచిలో పెట్రోల్ బాటిల్ కూడా పెట్టుకుని రావడంతో తహశీల్దార్ సహా సిబ్బంది భయపడ్డారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడినుంచి స్టేషన్‌కు తరలించారు.

    పోలీసుల కథనం ప్రకారం.. రమణ తండాకు చెందిన చాందావత్ వాల్యాకు 12 గుంటల భూమి ఉంది.ఆ భూమికి పట్టా చేయాల్సిందిగా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. చాంబర్‌లోనే ఆమెపై దుర్భాషలాడాడు. పట్టా చేయకపోతే చంపుతానని బెదిరించాడు. అతని సంచిలో పెట్రోల్ బాటిల్ ఉండటంతో తహశీల్దార్ భయపడిపోయారు.పోలీసులకు సమాచారం అందించడంతో అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ.. చాందా వాల్యా
    భూమిని గతంలోనే పట్టా చేశామని.. కానీ అమ్ముకున్న 12 గుంటల భూమిని కూడా పట్టా చేయాలని అతను కోరుతున్నాడని చెప్పారు.అది అక్రమం కాబట్టే పట్టా చేయట్లేదని వివరణ ఇచ్చారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Mro vijayareddy murder, Tahsildar, Telangana

    తదుపరి వార్తలు