టమాటాలు దొంగతనం చేసినందుకు రైతు హత్య...

రాజేంద్ర పటేల్ పొరుగున ఉండే చక్రేష్ పటేల్ పొలంలో టమాటాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. రాత్రి పూట పొలం కాపలాకు వెళ్లిన చక్రేష్ పటేల్‌కు ఈ దృశ్యం కంటపడింది.

news18-telugu
Updated: May 23, 2019, 6:46 PM IST
టమాటాలు దొంగతనం చేసినందుకు రైతు హత్య...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 23, 2019, 6:46 PM IST
టమాటాలు దొంగతనం చేసినందుకు ఓ రైతు తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తన పొలంలో టమాటాలు దొంగతనం చేసిన ఓ రైతును మరో రైతు చంపేశాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని పనగర్ ప్రాంతంలో రైతులు టమాటాలు పండిస్తున్నారు. చక్రేష్ పటేల్, రాజేంద్ర పటేల్ అనే ఇద్దరు రైతులు కూడా టమాట సాగు చేశారు. అయితే, రాజేంద్ర పటేల్ పంట సరిగా రాలేదు. చక్రేష్ పొలంలో టమాటాలు విరగకాశాయి. మరోవైపు వారంరోజుల్లో టమాట ధరలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో రాజేంద్ర పటేల్ పొరుగున ఉండే చక్రేష్ పటేల్ పొలంలో టమాటాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. రాత్రి పూట పొలం కాపలాకు వెళ్లిన చక్రేష్ పటేల్‌కు ఈ దృశ్యం కంటపడింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో చక్రేష్ పటేల్ గొడ్డలితో రాజేంద్ర పటేల్ మీద దాడి చేశాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...