హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో.. మహిళపై ఐదుగురి సాముహిక అత్యాచారం.. అసలేం జరిగిందంటే..

OMG: ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో.. మహిళపై ఐదుగురి సాముహిక అత్యాచారం.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: ఇద్దరు మహిళలు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ.. మరో మహిళను ఒక రోజు హోటల్ లో పనుందంటూ రమ్మని పిలిచింది. ఆ తర్వాత... అక్కడే అసలు నిజస్వరూనం బయట పెట్టింది.

Faridabad Six including woman booked for rape in haryana: హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది. సెక్యురీటి కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళ తోటి, ఉద్యోగిని పనిమీద హోటల్  కు పిలిచిందని వెళ్లింది. అక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. మహిళచేత ఒక కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత.. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో.. ఆమెపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు.

కాసేపటికి లేచి చూసే సరికి... ఆమెకు పరిస్థితి తెలిసింది. విషయం ఎవరికైన చెబితే.. తమవద్ద ఉన్న వీడియోలను పబ్లిక్ గా షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు. వీడియో అడ్డంపెట్టుకుని ఆమెపై కొంత మంది చాలా సార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటన 2020లో జరిగింది. దాదాపు రెండేళ్ల పాటు వారి టార్చర్ భరించింది. ఆ తర్వాత.. ఆమె పోలీసులకు జరిగిన దారుణాన్ని తెలిపింది.

వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళతో సహా..ఆరుగురు నిందితులను వీరేంద్ర దహియా, హరి సింగ్, జై ప్రకాష్, సుఖ్‌బీర్, దేవిరామ్‌లుగా గుర్తించి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేట్టారు.

బాలికపై అత్యాచార ఘటన జార్ఖండ్ లో జరిగింది.

Gang Rape  On Minor : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా 8వ తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి( Gang Rape On Girl)పాల్పడ్డారు.

8వ తరగతి చదువుతున్న బాలికకు ఫోన్ చేసి.. ఏకాంత ప్రదేశానికి రమ్మని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు మృగాళ్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ దారుణం జరిగింది. చాహ్నో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిందని సమాచారం అందిన గంటల్లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ముగ్గూరూ బాలిక ఉంటున్న గ్రామానికి చెందినవారేనని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు చెప్పారు.

First published:

Tags: Crime news, Harassment on women, Haryana

ఉత్తమ కథలు