సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో కలకలం రేపింది. ఫరీదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి విక్రమ్ కపూర్ ఫరీదాబాద్ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా పని చేస్తున్నారు. ఈ ఉదయం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఫరీదాబాద్‌లోని పోలీస్ లైన్స్ లోని సెక్టార్ 30లోని నివాసంలో ఉంటున్నా ఆయన సర్వీస్ రివాల్వార్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. విక్రమ కపూర్ వయసు 58 ఏళ్లు. ఆయనది కురుక్షేత్ర జిల్లా. గతేడాదే ఆయనకు ఐపీఎస్ అధికారిగా ప్రమోషన్ లభించింది. దీంతో విక్రమ్ కపూర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న వివరాల్ని సేకరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.