Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

Buffalo cut: హీరో పుట్టినరోజుకు దున్నపోతును బలిచ్చిన అభిమానులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

Buffalo cut: హీరో పుట్టినరోజుకు దున్నపోతును బలిచ్చిన అభిమానులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

సుదీప్​ పుట్టినరోజుకు దున్నపోతును బలిస్తున్న అభిమానులు

సుదీప్​ పుట్టినరోజుకు దున్నపోతును బలిస్తున్న అభిమానులు

తమ అభిమాన హీరో పుట్టినరోజుకు భారీ ఫ్లెక్సీలు, కౌటౌట్ లు, బ్యానర్లు ఏర్పాటు చేసి గజమాలలు వేస్తుంటారు ఫ్యాన్స్​. వందలాది లీటర్ల పాలతో పాలాభిషేకం చేస్తుంటారు. అన్నదానాలు, రక్తదానాలు, నేత్రదానాలు చేస్తుంటారు. పేదలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంచిపెడుతుంటారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ కన్నడ( kannada) సూపర్​స్టార్​ కిచ్చా సుదీప్ (Sudeep)​ అభిమానులు పుట్టిన రోజు సందర్బంగా అతి తెలివి ఉపయోగించారు.

ఇంకా చదవండి ...

అభిమానులు(fans). హీరో(hero)ని దేవుడిలా కొలిచే భక్తజనంలా తయారయ్యారు. ఇక తమ హీరో సినిమా అప్​డేట్స్​ వస్తే ఊగిపోతుంటారు. ట్విటర్​, ఫేస్​బుక్​, వాట్సాప్​ ఇలా ప్రతీ ఒక్క సోషల్​మీడియాలో ట్రెండింగ్​లో ఉంచుతారు. ఎంతలా అంటే కనీసం వారిని, వారి జీవితాలను కూడా పట్టించుకోనంత. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు(birthday) వస్తే చాలు. ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి మరీ వేడుకలు జరుపుతారు. మరికాస్త ఉన్నవాళ్లయితే భారీ ఫ్లెక్సీలు, కౌటౌట్ లు, బ్యానర్లు ఏర్పాటు చేసి గజమాలలు వేస్తుంటారు. వందలాది లీటర్ల పాలతో పాలాభిషేకం చేస్తుంటారు. అన్నదానాలు, రక్తదానాలు, నేత్రదానాలు చేస్తుంటారు. పేదలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంచిపెడుతుంటారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ కన్నడ( kannada) సూపర్​స్టార్​ కిచ్చా సుదీప్ (Sudeep)​ అభిమానులు పుట్టిన రోజు సందర్బంగా అతి తెలివి ఉపయోగించారు.

అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆ వీరాభిమానులు తమ అభిమాన హీరో సుదీప్(Sudeep)​ పుట్టిన రోజు సందర్బంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రెండు సింహాలు నడుచుకుని వస్తుంటే మధ్యలో అభిమాన హీరో ఫోటోలు ఉండేలా పెద్ద భ్యానర్లు ఏర్పాటు చేశారు. హీరో ఫ్యాన్స్ అందరిని అక్కడికి పిలిపించిన ఆ వీరాభిమానులు సుదీప్​ జిందాబాద్, ఇక ముందు మా హీరో నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ కావాలని గట్టిగా నినాదాలు చేశారు. ఆ తరువాత ఆ వీరాభిమానులు సుదీప్​ ఫోటో ముందు దున్నపోతు(buffalo)ను బలి ఇచ్చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్ అయ్యింది. జంతు(Animal) బలిని చాలా మంది వ్యతిరేకిస్తున్న సమయంలో ఇలా హీరో పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు దున్నపోతు(buffalo)ను బలి ఇవ్వడం వివాదానికి కారణం అయ్యింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 25 మందిపై కేసులు నమోదుచేశారు.

హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడలో సూపర్​స్టార్​గా గుర్తింపు ఉంది. చాలా హిట్​ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. తెలుగులో పవన్​ కల్యాణ్​ నటించిన అత్తవారింటికి దారేటి కన్నడ రీమేక్​లోనూ ఆయనే నటించారు. అక్కడ ఆ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక తెలుగులోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కొన్ని సినిమాల్లో నటించిన సుదీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, రక్తచరిత్ర సినిమాలో కూడా పోలీసు అధికారి పాత్రలో నటించిన సుదీప్ తెలుగు అభిమానులకు దగ్గర అయ్యారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ గా నటించిన సుదీప్ ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుని సినీ అభిమానులకు చాలా దగ్గర అయ్యారు. బాహుబలిలోనూ ఏ ప్రాతంలో మెరిశారు. ఇపుడు ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం విక్రాంత్​ రాణా మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన విక్రాంత్​ రాణా ఫస్ట్​ గ్లింప్స్​ ట్రెండింగ్​లో ఉంది.

ఇది కూడా చదవండి: సముద్రం మధ్యలో ఉండగా మనిషి మీది కొచ్చిన పెద్ద పాము.. వచ్చి ఆ పాము ఏం చేసిందో తెలుసా?

First published:

Tags: Animal Lovers, Birthday, Fans trolling, Hero, Kannada Cinema

ఉత్తమ కథలు