హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG:  వీడు మాములోడు కాదు.. లగ్జరీ లైఫ్ కోసం బూట్లు, చెప్పులను కూడా వదల్లేదు..

OMG:  వీడు మాములోడు కాదు.. లగ్జరీ లైఫ్ కోసం బూట్లు, చెప్పులను కూడా వదల్లేదు..

యూట్యూబర్ అభిమన్యు గుప్తా (ఫైల్)

యూట్యూబర్ అభిమన్యు గుప్తా (ఫైల్)

Mumbai: యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాడు. అతనికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది. అయితే ఏం లాభం.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయడానికి చోరీల బాటపట్టాడు.

కొంత మంది లేనిదాన్ని చూపించాలనుకుంటారు. దీని కోసం చోరీలు చేయడానికి సైతం వెనుకాడరు. డబ్బున్న వారు ఉండే అపార్ట్ మెంట్ భవనాల్లో ఇల్లు అద్దేకు తీసుకుంటారు. ఆ తర్వాత.. అక్కడి కాస్లీ వస్తువులను చోరీలు చేస్తుంటారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (Mumbai)  లగ్జరీ లైఫ్ కోసం యూట్యూబర్ అభిమన్యు గుప్తా చోరీల బాటపట్టాడు. పొద్దున వీడియోలు తీస్తుంటాడు. రాత్రికాగానే చోరీలను చేస్తుంటాడు. ఇతను ఇప్పటిదాక.. థానే, నయీ ముంబై, ముంబైలోని అనేక ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డాడు. ఇతనిపై అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గుప్తాకుర్లా ప్రాంతంలో చోరీ చేసి పారిపోతుండగా పోలీసులు ఇతడిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఇతని దగ్గర నుంచి 14 నకిలీ మొబైల్ ఫోన్ లు, పదునైన ఆయుధాలు, నకిలీ బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇదిలా ఉండగా కేరళలో ఒక వ్యక్తి ఏకంగా బస్సునే చోరీ చేశాడు.

మెకానిక్ వేషంలో వచ్చిన దొంగ ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. అది కూడా ఆర్టీసీ బస్లాండ్ నుంచే బస్సుని దొంగలించాడు. కేరళ(kerala)లోని అలువా డిపోలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మెకానిక్‌ దుస్తులు ధరించి డిపోకు వచ్చిన నిందితుడు కేఎస్ఆర్టీసీ బస్సుని దొంగలించాడు. అలువ నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన బస్సును చోరీ చేసుకొని వెళ్లాడు. బస్సును చెకింగ్ కోసం మెకానిక్ తీసుకెళ్తున్నాడని అక్కడి ఉద్యోగులు భావించారు. అయితే అతివేగంగా వస్తున్న బస్సును చూసి అనుమానం వచ్చిన సెక్యూరిటీ అధికారి డిపోకు సమాచారం అందించారు. డిపో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం కోసం బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే బస్సుని దొంగలించి ఎర్నాకులంకి తీసుకెళ్తున్న సమయంలో దారిలో కలూర్ సమీపంలో ఓ వాహనాన్ని ఢీకొట్టాడు నిందితుడు. ప్రమాదం గురించి సమాచారం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆరా తీయగా బస్సు చోరీ విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా,అతడు బస్సుని దొంగతనం చేస్తున్న సమయంలో సీసీటీవీలో నమోదైన దృశ్యాలు వైరల్ గా మారాయి.​

First published:

Tags: Crime news, Mumbai, Theft, Youtuber

ఉత్తమ కథలు