FAMILY SUICIDE WHEN THEY ENQUIRED BY POLICE IN A CASE IN KARNATAKA VRY
family suicide : పరువు ఆత్మహత్యలు.. .. పోలీసులు విచారణ చేశారని ఆందోళన.. 5గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
family suicide : కుటుంబ పరువు కోసం ఇంట్లోని ఐదుగురు సభ్యులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.. ఒకరు చేసిన తప్పుకు పోలీసులు విచారణ చేయడంతో గిల్టిగా ఫీల్ అయిన వారు ఈ దారుణానికి పాల్పడ్డంటూ పోలీసులు తెలిపారు..
కుటుంబ పరువు కోసం ఎంతకైనా తెగించే వారు ఉన్నారు.. ఇందుకోసం తమ ప్రాణాలు తీసుకోవడం లేదంటే పక్కవాడి ప్రాణాలను తీయడం ఇలా పరువు కోణంలో జరిగే హత్యలు,ఆత్మహత్యలు అనేకం చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా పరువు పోయిందని ఓ కుటంబం మొత్తం పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ల వరకు అందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాగా ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగినా నేడు పోలీసులు ఆత్మహత్యలుగా దృవీకరించడంతో వెలుగులోకి వచ్చింది.
కోలార్ పట్టణానికి చెందిన మునియప్ప కుమార్తె , పుష్పకు అదే గ్రామంలోని మరో కుటుంబానికి చెందిన యువతి 20 రోజుల కిందట ఓ చిన్నారిని ఇచ్చి తాను అత్యవసరంగా వేరే గ్రామానికి వెళ్లాల్సి ఉన్నందున కొంచెం ఆ చిన్నారీని చూసుకోవాలని కోరింది. అందుకు పుష్ప అంగీకరించి పాపను స్వీకరించింది. ఆ తర్వాత పక్క ఊరికి వెళ్లిన ఆ యువతి కాసేపటి తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం తన పాపను ఇవ్వాల్సిందిగా ఆ యువతి కోరింది..అయితే ఎందుకనో పుష్ప ప్లేట్ ఫిరాయించింది. పాప ఎక్కడిది అంటూ ఎదురు ప్రశ్నించింది.. తనకు ఎవ్వరినీ ఇవ్వలేదంటూ పుష్ప బుకాయించింది..
దీంతో షాక్ కు గురైన బాధిత యువతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన స్థానిక గల్పేట పోలీసులు మునియప్ప, ఆయన కుటుంబ సభ్యులను ఈ విషయమై విచారణ జరిపారు.. దీంతో తమ కుటుంబానికి సంబంధించి పోలీసులు విచారణ జరపడంతో తమ కుటుంబ పరువు పోయిందని ఆ కుటుంబ సభ్యులు ఐదుగురు భావించారు. ఇంట్లో ఉన్న మునియప్పతో పాటు (75), భార్య నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17), పుష్ప (33)లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గుర్తించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.. కాగా అప్పటికే పుష్ప మినహా నలుగురు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు . ప్రాణాపాయ స్థితిలో ఉన్న పుష్పను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోవడంతో ఆమె కూడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.