• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • FAMILY SELLS MINOR FOR RS 1 55 LAKH IN MADHYA PRADESH AFTER SHE ELOPES WITH HER SISTER HUSBAND SU

అక్క భర్తతో పారిపోయిన చెల్లెలు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ 15 ఏళ్ల బాలిక తన అక్క భర్తతోనే సంబంధం పెట్టకుంది. ఈ క్రమంలోనే అతనితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది.

  • Share this:
    ఓ 15 ఏళ్ల బాలిక తన అక్క భర్తతోనే సంబంధం పెట్టకుంది. ఈ క్రమంలోనే అతనితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక అక్క భర్తతో కలిసి గుజరాత్‌కు పారిపోయింది. వివరాలు.. ధార్ జిల్లాలోని ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. తన అక్క భర్తతో పారిపోయింది. ఈ విషయం తెలిసిన బాలిక అక్క పంచాయితీ పెద్దలను ఆశ్రయించింది. చెల్లెలికి తన భర్తతో ఎఫైర్ ఉందని అక్క పంచాయితీ పెద్దలకు చెప్పింది. దీంతో గ్రామంలో పంచాయతీ నిర్వహించిన పెద్దలు.. పారిపోయిన వారిద్దరిని అక్కడికి పిలించారు.

    అనంతరం పంచాయితీ పెద్దల సూచన మేరకు బాలికను ఆమె తల్లిదండ్రులు మన్నవార్ మండలానికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి విక్రయించడానికి ఒప్పుకున్నారు. ఇందుకోసం రూ. 1.55 లక్షలకు ఒప్పందం కూడా చేసుకున్నారు. ముందస్తుగా బాలిక కుటుంబానికి అతడు రూ. 5 వేలు ఇచ్చాడు. అలాగే కమ్యూనిటీ విందు కోసం మరో 5 వేల రూపాయలు అదనంగా కేటాయించాడు.

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అధికారికంగా ఫిర్యాదు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ఇది చదవండి: Telangana: భర్తకు బుద్ది చెప్పాలని చూసిన భార్య.. కానీ చివరకు జరిగింది ఏమిటంటే..

    అయితే దీనిని అడ్డుకున్న జిల్లా చైల్డ్‌లైన్ సభ్యులు.. బాలికను రక్షించారు. అనంతరం బాలికకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై జిల్లా చైల్డ్ లైన్ మెంబర్ పంకజ్ జైన్ మాట్లాడుతూ..‘మేము బాలిక గ్రామానికి చేరుకుని ఆమెను రక్షించాం. తర్వాత ఆమెను చైల్డ్ షెల్టర్ హోమ్‌కు పంపించాం’ అని తెలిపారు. ఇక, ఆ బాలిక చదువుకోవాలని ఉందని చెప్పిందని.. అదే సమయంలో తన అక్క భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటుందని అధికారులు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: