అమ్మాయిలను ఆటబొమ్మల్లా చూడటం... వాళ్లతో వ్యభిచారం చేయించడం కొంత మందికి భలే ఇష్టం. డబ్బు ఆశ చూపి... ఆ ఉచ్చులోకి దింపి... చాలా డ్రామాలు ఆడుతారు. తాజాగా ఉత్తరప్రదేశ్... ఘజియాబాద్‌లో.. ఓ ఫ్లాట్‌పై పోలీసులు దాడి చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మగవారు అయితే... ఆరుగురు యువతులు ఉన్నారు. ఈ దాడి తర్వాత పోలీసులకు ఓ కొత్త విషయం తెలిసింది. ఈ సెక్స్ రాకెట్ ఇక్కడ పుట్టింది కాదు. వీళ్లు తరచుగా ప్లేసులు మార్చేస్తున్నారని అర్థమైంది. ముందుగా ఓ ఇంట్లో అద్దెకు దిగడం... ఆ తర్వాత చుట్టాలంటూ... మగవాళ్లను ఇంటికి పిలిపించుకోవడం... ఆ తర్వాత సెక్స్ రాకెట్ నడపడం... కొన్ని రోజుల తర్వాత... మరో ఇల్లు చూసుకోవడం... ఇలా చేస్తున్నారు.
ఘజియాబాద్‌లోని DLFలోని సీ బ్లాకులోని ఓ ప్లాట్‌కి తరచూ మగాళ్లు వచ్చి పోతుంటే... మిగతా వాళ్లకు ఎందుకో అర్థం కాలేదు. తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా... మనకెందుకులే అనే ఫీలింగ్ వెనక్కి లాగేస్తూ వచ్చింది. కానీ ఎవరో ఒకరికి ఉత్సుకత ఉంటుందిగా... వాళ్లు కూపీ లాగి... విషయం కనిపెట్టి... పోలీసులకు లీక్ చేశారు. కట్ చేస్తే పోలీసులు వచ్చేశారు. అలా తంతు బయటపడింది.
ఇక్కడ దుకాణం తెరిచి 8 రోజులే అయ్యిందట. కానీ పాత కస్టమర్లకు కాల్ చేసి ఇక్కడకు పిలిపించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. మరో విషయమేంటంటే... ఫ్లాట్‌ని అద్దెకు ఇచ్చిన ఓనర్‌కి కూడా ఈ రాకెట్ గురించి తెలుసట. ఆయనకు పర్సెంటేజీ ఇవ్వడంతో... సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడైతో పోలీసులు దాడి చేశారో... తన సొంత ఇంటి నుంచి ఎక్కడికో పారిపోయాడట. ఆయన కోసం ఓ టీమ్ వెతుకుతోంది.
ఇప్పుడు దొరికిన 9 మందిలో ముగ్గురు మగాళ్లున్నారు కదా... వాళ్ల పేర్లు సమీర్, ఫర్మాన్, రవి. వీళ్లు చాలా తెలివైన వాళ్లు. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. కోడ్ లాంగ్వేజీలో మాట్లాడుతున్నారు. బాగా డబ్బు ఉండి... పనీ పాటా లేకుండా రాత్రి వేళ కార్లలో తిరిగేవాళ్లను వీళ్లు టార్గెట్ చేస్తారు. అదిరిపోయే ఫిగర్స్ అంటూ లేని పోని మాటలు చెబుతారు. అవతలి వాళ్లు కాస్త బెండ్ అయితే చాలు... ఇక తమ బుట్టలో పడేసుకొని కస్టమర్లుగా చేసుకుంటారు. అమ్మాయిల వీడియోలను మొబైల్స్‌లో చూపించి... ఎవరు కావాలో డిసైడ్ చేసుకోమంటున్నారు. ఆ తర్వాత డీల్ సెట్ చేసుకొని... తంతు కానిస్తున్నారు. డబ్బు తీసుకోవడానికి గూగుల్ పే, పేటీఎం లాంటి వాటిని వాడుతున్నారు. ఇట్లా అంతా హైటెక్ పద్ధతిలో సాగిపోతుంటే... పోలీసులు కూడా అంతే తెలివిగా వీళ్లను పట్టుకోగలిగారు.
పోలీసులపై స్థానికుల సీరియస్:
పోలీసులు తాము ఓ రాకెట్ పట్టుకున్నామని ఆనందంగా చెప్పుకుంటుంటే... స్థానికులు మాత్రం పోలీసులపై ఫైర్ అవుతున్నారు. ఇదేమీ కొత్త కాదనీ... ఈ చుట్టుపక్కల తరచూ ఇలాంటి రాకెట్లు కొనసాగుతున్నాయని అంటున్నారు. పోలీసులు తాపీగా వచ్చి పట్టుకొని... ఇన్నాళ్లూ ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.