Home /News /crime /

FAMILY OF 3 MURDERED IN KUWAIT THE ACCUSED IS AN EXPAT FROM ANDHRA PRADESH KADAPA DISTRICT MKS

Kuwait ట్రిపుల్ మర్డర్ కేసులో Kadapa వాసి : యజమాని కుటుంబాన్ని దారుణంగా! -మరణశిక్ష?

నిందితుడు వెంకటేశ్ (photo credit: sakshi)

నిందితుడు వెంకటేశ్ (photo credit: sakshi)

కువైట్ సిటీలో ఓ షేక్ కుటుంబం దారుణ హ్యత్యకు గురికాగా, ఆ కేసులో నిందితుడు కడప వాసేనని వెల్లడైంది. యజమాని ఇంట్లో చోరీకి యత్నించి, అడ్డొచ్చిన ముగ్గురినీ హతమార్చగా, నిందితుడికి మరణశిక్ష సైతం విధించినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది..

గల్ఫ్ దేశం కువైట్‌లో చోటుచేసుకున్న మూడు హత్యల ఉదంతం ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో కలకలానికి దారి తీసింది. కువైట్ సిటీలో ఓ షేక్ కుటుంబం దారుణ హ్యత్యకు గురికాగా, ఆ కేసులో నిందితుడు కడప వాసేనని వెల్లడైంది. యజమాని ఇంట్లో చోరీకి యత్నించి, అడ్డొచ్చిన ముగ్గురినీ హతమార్చగా, నిందితుడికి మరణశిక్ష సైతం విధించినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. కువైట్ ప్రభుత్వం నుంచిగానీ, అక్కడి ఇండియన్ ఎంబసీ నుంచిగానీ స్పష్టమైన ప్రకటనలు లేకున్నా, కడపలో నివసిస్తోన్న సంబంధిత కుటుంబీకుల ద్వారా విషయాలు బయటికొస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం స్థానికంగా వైరలవుతోంది..

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేశ్ బతుకుదెరువు కోసం మూడేళ్ల కిందట కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ షేక్ ఇంట్లో డ్రైవర్ గా పనిలో చేరాడు. రెండేళ్ల తర్వాత వెంకటేశ్ తన భార్య స్వాతిని కూడా కువైట్ తీసుకెళ్లాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడే ఉంటుండగా, వాళ్ల ఇద్దరు పిల్లలు మాత్రం దిన్నెపాడులో తాత(శ్రీరాములు) దగ్గర ఉంటున్నారు. కాగా,

CM KCR: ఒకే సారి 50,000 ఉద్యోగాలు భర్తీ.. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన ఇదే? -ముందస్తు ఎన్నికలు పక్కా!


కువైట్‌లో వెంకటేశ్ పనిచేస్తున్న ఇంటి యజమానిని, అతడి భార్య, కుమార్తెలు ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఉదంతానికి సంబంధించి శ్రీరాములు స్థానిక మీడియాకు కీలక విషయాలు చెప్పారు. వారం రోజుల కిందట కువైట్‌ నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని.. యజమానిని, ఆయన భార్యాకూతుళ్లను కత్తితో గొంతు కోసి చంపిన నేరం కింద కొడుకు(వెంకటేశ్)ను పోలీసులు తీసుకెళ్లినట్టు అవతలి వ్యక్తి నుంచి సమాచారం వచ్చిందన్నారు శ్రీరాములు.

Kuwait : ప్రవాస కార్మికులకు షాకిచ్చిన కువైట్.. 60 ఏళ్లు దాటినవారిపై ఇదీ తాజా నిర్ణయం


యజమాని కుటుంబాన్ని హతమార్చాడనే ఆరోపణలపై తన కుమారుడు(వెంకటేశ్)కు ఉరిశిక్ష పడుతుందని అక్కడివారు ఫోన్లో తెలిపారని శ్రీరాములు చెబుతున్నారు. వారం కిందటే వెంకటేశ్ ఇంటికి ఫోన్‌ చేసి పిల్లల క్షేమసమాచారాలు తెలుసుకున్నాడని, కానీ ఇంతలోకే ఇలా జరిగిందని శ్రీరాములుతోపాటు బంధువులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని, ఎంబసీని సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Kadapa, Kuwait, Murder case

తదుపరి వార్తలు