తమ్ముడి ప్రేమకు సహకరించినందుకు.. అమ్మాయి తరపు బంధువులు అన్నను..

ప్రవీణ్ ఆ ప్రేమ జంట కోసం వెతికేందుకు పెద్దచింతకుంటకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవీణ్‌పై సోమవారం అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు.

news18-telugu
Updated: June 4, 2020, 10:44 AM IST
తమ్ముడి ప్రేమకు సహకరించినందుకు.. అమ్మాయి తరపు బంధువులు అన్నను..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమ్ముడి ప్రేమకు సహకరించినందుకు అమ్మాయి తరపు బంధువులు అన్నను హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం పేరూరుకు చెందిన ఓ ప్రేమ జంట గ్రామం నుంచి పారిపోయారు. పోరిపోయిన ప్రేమ జంటలోని యువకుడికి ఇదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కొడుకు ప్రవీణ్ కుమార్(29) సోదరుడు. అయితే ఆ ప్రేమ జంట పారిపోయేందుకు ప్రవీణ్ కుమార్ సహకరించాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఈ విషయమై సంప్రదించారు. దీంతో పోలీసులు ఆ ప్రేమ జంటను వెతికి తీసుకురావాలంటూ ప్రవీణ్‌కు సూచించారు. అయితే ప్రవీణ్ ఆ ప్రేమ జంట కోసం వెతికేందుకు పెద్దచింతకుంటకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవీణ్‌పై సోమవారం అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు.

దాంతో ప్రవీణ్ తప్పించుకుని ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గూబగుండం మెట్టకు చేరుకున్నాడు. అయినా అమ్మాయి కుటుంబ సభ్యులు వెంటాడి మరీ కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయాడు. ప్రవీణ్‌పై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే.. ప్రవీణ్ కుమార్ సైతం గతంలో ఇతర మతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే తమ్ముడు ప్రేమను గెలిపించాలని వారిని కలిపేందుకు ప్రయత్నించి తాను మృత్యుఒడికి చేరుకున్నాడు.
First published: June 4, 2020, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading