హోమ్ /వార్తలు /క్రైమ్ /

Trending: పోలీస్ స్టేషన్‌కు చేరిన వధువు మేకప్ పంచాయతీ.. రూ. 3 వేలకు అలా మేకప్ చేయలేనంటూ..

Trending: పోలీస్ స్టేషన్‌కు చేరిన వధువు మేకప్ పంచాయతీ.. రూ. 3 వేలకు అలా మేకప్ చేయలేనంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Makeup Conflict: ముందుగా రూ.500 చెల్లించి బ్యూటీషియన్ ను బుక్ చేసుకున్నారు. కానీ పెళ్లి రోజు ఫోన్ చేస్తే ఫోన్‌కి హాజరు కాలేదు. ఆ తర్వాత ఇంటికి రాలేనని బాలిక కుటుంబసభ్యులకు మెసేజ్ వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు షాకింగ్ కేసు పెట్టారు. వధువు మేకప్‌ను మేకప్ ఆర్టిస్ట్ పాడు చేశాడని ఆరోపించారు. అయితే దీనిపై బ్యూటీషియన్ స్పందించింది. రూ. 3 వేలకు ఐశ్వర్యరాయ్‌ని తయారు చేయలేనని తెలిపింది. ఇది వివాహాల సీజన్. ఈ సీజన్‌లో బ్యూటీషియన్‌లకు చాలా డిమాండ్ పెరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 3న ఓ వివాహం జరగనుంది. ఈ పెళ్లికి వధువును అలంకరించేందుకు కుటుంబసభ్యులు బ్యూటీషియన్‌ను బుక్ చేసుకున్నారు. బ్యూటీషియన్ ఇంటికి వచ్చి వధువును సిద్ధం చేయాల్సి వచ్చింది. ఇందుకోసం అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చారు.

అయితే ఈ సందర్భంగా వధువు బ్యూటీషియన్ ఇంటికి రాకపోవడంతో వధువు బలవంతంగా పార్లర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా బ్యూటీషియన్ మేకప్ చెడగొట్టిందని.. ఆ తర్వాత తాము నవ్వులపాలయ్యామని వధువు ఆరోపించింది. పెళ్లికూతురు మేకప్‌ సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. దీంతో ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బ్యూటీషియన్‌పై కేసు నమోదు చేశారు. పార్లర్‌లో కూడా పూర్తిగా ట్రెండీగా లేని కొత్త ఆర్టిస్ట్‌తో వధువు అలంకరణ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనితో పాటు బ్యూటీషియన్‌ను అసభ్యకరంగా, తప్పుడు పదాలను ఉపయోగించాడని కూడా దూషించారు.

కేసును మహిళా అధికారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా రూ.500 చెల్లించి బ్యూటీషియన్ ను బుక్ చేసుకున్నారు. కానీ పెళ్లి రోజు ఫోన్ చేస్తే ఫోన్‌కి హాజరు కాలేదు. ఆ తర్వాత ఇంటికి రాలేనని బాలిక కుటుంబసభ్యులకు మెసేజ్ వచ్చింది.

ప్రపంచంలోనే 10 విచిత్రమైన విమానయాన సంస్థలు..బికినీ ఎయిర్ హోస్టెస్‌లు కూడా!

Tiger video : పొదల్లో దాక్కున్న పెద్దపులి.. భయంతో పర్యాటకుల కేకలు

అదే సమయంలో వధువును పార్లర్‌కు తీసుకురావాలని బ్యూటీషియన్ తెలిపింది. అక్కడ మేకప్ చేస్తానని చెప్పింది. అయితే పార్లర్‌కు చేరిన తర్వాత కూడా పెళ్లికూతురు మేకప్ ఆమె కోరుకున్న విధంగా కుదరలేదు. వధువు ఆరోపణలపై బ్యూటీషియన్ మోనిక స్పందించింది. వాళ్లు ఇస్తానన్న రూ. 3000కు ఐశ్వర్య రాయ్ లాగా మేకప్ సాధ్యం కాదని తెలిపింది. అదే సమయంలో మేకప్ ఆర్టిస్ట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక పోలీసులను కోరింది.

First published:

Tags: Trending

ఉత్తమ కథలు