హోమ్ /వార్తలు /క్రైమ్ /

దారుణం.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే యువకుడు..

దారుణం.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే యువకుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. అశోక్ వర్మ ఒక్కడు ఒక వైపు కాగా, అతడి తల్లి కస్తూరి వరలక్ష్మి, అక్కబావలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు మరో వైపు ఉన్నారు. వీరి మధ్య గొడవలు రోజురోజూకీ తారస్థాయికి చేరుతున్నాయి.

సొంత కుటుంబ సభ్యులే ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డులోని దరి రామచంద్రనగర్‌కు చెందిన సీతారామరాజు, కస్తూరి వరలక్ష్మి దంపతులు. వీరికి కొడుకు అశోక్ వర్మ(29), కూతురు శ్రీదేవి ఉన్నారు. కూతురు శ్రీదేవికి వెంకటేశ్వరరావుతో వివాహం జరిపించారు. అయితే కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. అశోక్ వర్మ ఒక్కడు ఒక వైపు కాగా, అతడి తల్లి కస్తూరి వరలక్ష్మి, అక్కబావలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు మరో వైపు ఉన్నారు. వీరి మధ్య గొడవలు రోజురోజూకీ తారస్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి వీరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే తల్లి కస్తూరి వరలక్ష్మి, అక్కాబావలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు ముగ్గురు కలిసి అశోక్ వర్మను హత్య చేశారు.

పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే.. ఇంతకీ అశోక్ వర్మను ఎందుకు హత్య చేశారన్నవిషయంపై స్పష్టత లేదు. ఈ హత్యకు ఆస్తి తగాదాలు కారణమా..?, లేక ఏదైనా వివాహేతర సంబంధమా?, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Murder, Visakha

ఉత్తమ కథలు