హోమ్ /వార్తలు /క్రైమ్ /

Haryana: ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంటే..శిక్ష అత్తమామలకు పడింది

Haryana: ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంటే..శిక్ష అత్తమామలకు పడింది

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Viral Video: ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులే ఆ యువతిని కిడ్నాప్ చేశారు. అత్త,మామల ఇంట్లో ఉండగా వారిపై కాల్పులు జరిపి యువతిని ఎత్తుకెళ్లారు. హర్యానాలో జరిగిన ఈ కిడ్నాప్‌ కేసును పోలీసులు 24గంటల్లో చేధించారు. యువతిని రక్షించారు.

ఇంకా చదవండి ...

ప్రేమ వివాహం చేసుకొని అత్తా,మామల ఇంట్లో ఉంటున్న యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన అత్త,మామపై దాడి చేశారు. అప్పటికి కిడ్నాపర్లను వదలకపోవడంతో తుపాకులతో కాల్పులు జరిపి యువతిని ఎత్తుకెళ్లారు. హర్యానా(Haryana)లోని మహేంద్రగడ్ (Mahendragarh)జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలనకు చెందిన యువతి ఖాటోడ్‌(Khatod)కి చెందిన దీపక్‌(Deepak)ను మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులను వదిలి వచ్చి అత్త,మామల ఇంట్లో ఉంటోంది. తమ బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకని యువతి కుటుంబ సభ్యులు, మేనమామతో పాటు మరో 8మంది కలిసి రెండు బొలెరో వాహనాలు(Two bolero vehicles), బైక్‌లపై వెళ్లి ఆమెను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ అమర్చిన సీసీ కెమెరా(Cc camera)లను ధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడ్డారు. యువతిని తీసుకెళ్లేందుకు తెగించారు. అడ్డుకోబోయిన వాళ్లను ఆడ, మగ తేడా లేకుండా అందరిని చేతుల్లో ఉన్న ఆయుధాలు, కర్రలతో చితకబాదారు. అప్పటికి యువతి అత్తమామలు, కిడ్నాపర్లను వదలకపోవడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. ఈఘటనలో యువతి అత్త సుమన్‌ కాలికి బుల్లెట్‌ తగడలడంతో అందరూ వదిలేశారు. యువతిని తీసుకొని ఆమె కుటుంబ సభ్యులు పారిపోయారు. విషయం తెలుసుకున్న సదర్ మహేంద్రగడ్‌ జిల్లా పోలీసులు హుటాహుటిన జిల్లాలోని పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి 24గంటల్లో కిడ్నాప్‌కి గురైన యువతిని క్షేమంగా పట్టుకున్నారు.

ప్రేమ పెళ్లి చేసుకుందని..

కిడ్నాప్‌, దాడి చేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరించగా కిడ్నాపర్లు యువతిని రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు భారీగా మోహరించినట్లు తెలుసుకున్న కిడ్నాపర్లు యువతిని వదిలి పారిపోయారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా సదర్‌ మహేంద్రగడ్‌ ఏఎస్‌పీ సిద్దార్ద్‌జైన్‌ తెలిపారు.


కుటుంబ సభ్యులే కిడ్నాపర్లు..

మహేంద్రగఢ్ ఖాతౌడ్ గ్రామంలో కాల్పులు జరిపి మహిళను కిడ్నాప్ చేసిన నేరస్తుల్ని వెంటనే పట్టుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్ర మోహన్ అధికారుల్ని ఆదేశించారు. జిల్లా అధికారి ఆదేశాలతో యువతి క్షేమంగా పట్టుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులు కొందరు పట్టుబడగా మరికొందరు తప్పించుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Haryana, Love marriage

ఉత్తమ కథలు