ప్రియురాలు ఇక లేదని.. ప్రియుడు ఆత్మహత్య

పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించరేమోనన్న ఆందోళనతో యువతి ఆత్మహత్య చేసుకోగా, ప్రియురాలు లేకుండా బతకలేని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ నగరంలో సంచలనం రేపింది.

news18-telugu
Updated: February 13, 2020, 10:22 AM IST
ప్రియురాలు ఇక లేదని.. ప్రియుడు ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమికుల దినోత్సవానికి ముందురోజే ఓ ప్రేమకథ విషాదాంతంగా ముగిసింది. తాను లేని లేకంలో నేను బతకలేనంటూ ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే ప్రియుడు సైతం ఉరేసుకున్న ఘటన సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా యలమంచిలి నెహ్రూనగర్‌కు చెందిన ఈరిగిల వెంకటేష్(23), విశాఖ నగరంలోని గోపాలపట్నానికి చెందిన ఓ యువతి(19) కొన్ని సంవత్సరాలుగు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఒకరి వైపు కుటుంబ సభ్యులు సానుకూలంగా ఉండగా, మరొకరి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకుంటారో లేదనని భయపడుతుండేవారు. వీరిద్దరూ ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకున్నా.. పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చేది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం యువతి ప్రియుడు వెంకటేశ్‌కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పింది.

దీంతో కంగారుపడిన వెంకటేశ్ యలమంచిలి నుంచి విశాఖ నగరంలోని బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్న సోదరి ఇంటికి వచ్చాడు. అనంతరం ప్రియురాలి సోదరికి ఫోన్ చేసి సదరు యువతి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపిందని, ఆమె పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పాడు. కానీ అప్పటికే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో సోదరికి బయటికెళ్లి వస్తానని చెప్పాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో వెంకటేశ్ సోదరుడు ఫోన్ చేయగా, తన ప్రియురాలు లేకుండా బతకలేనని.. తానూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని పలు ప్రాంతాల్లో వెతకగా, మధుసూదననగర్‌లోని ఓ చెట్టుకు ఉరేసుకుని కన్పించాడు. మృతుడి సోదరుడు గణేష్.. కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి.. కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు వెంకటేశ్ తొలుత చేతి మణికట్టు నరాలు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. అది విఫలమవ్వడంతో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
Published by: Vijay Bhaskar Harijana
First published: February 13, 2020, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading