Home /News /crime /

FAMILY MEMBERS COMMIT SUICIDE BY WRITING SUICIDE NOTE IN KARNATAKA AND DO YOU KNOW WHAT WAS WRITTEN IN THE SUICIDE NOTE PRV

Karnataka: కర్ణాటకలో దారుణం.. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏం రాశారంటే..

(ప్రతీకాత్మక చిత్రం

(ప్రతీకాత్మక చిత్రం

కుటుంబంలో భార్య (wife) చనిపోయిన, భర్త (husband) చనిపోయినా కుటుంబం తీవ్ర విషాదానికి లోనవుతుంటుంది. కొన్నికొన్ని కుటుంబాలే ఆత్మహత్యలకు ఒడిగడుతుంటాయి. కారణాలు ఏవైనా.. వారు చేసిన పనిని చూసి కంటతడి పెట్టించేలా ఉంటుంది.  ఇలాంటి హృదయవిదారకర ఘటనే పక్క రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
    కరోనా (corona) ప్రపంచాన్ని కుదిపేసింది. లాక్​డౌన్ (lockdown)​ జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చాలామంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇక మధ్య తరగతి జీవుల (middle class people) పరిస్థితి అయితే వర్ణనాతీతం. కరోనా వచ్చినపుడు ఆసుపత్రులు చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడ్డాడు. పేదల అయితే వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. నెలల పాటు ఏదోలా నెట్టుకొచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందులు (financial problems), కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు (suicides) పాల్పడుతున్నాయి. కుటుంబ పెద్ద ఆత్మహత్యకు పాల్పడితే కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కుటుంబంలో భార్య (wife) చనిపోయిన, భర్త (husband) చనిపోయినా కుటుంబం తీవ్ర విషాదానికి లోనవుతుంటుంది. కొన్నికొన్ని కుటుంబాలే ఆత్మహత్యలకు ఒడిగడుతుంటాయి. కారణాలు ఏవైనా.. వారు చేసిన పనిని చూసి కంటతడి పెట్టించేలా ఉంటుంది.  ఇలాంటి హృదయవిదారకర ఘటనే పక్క రాష్ట్రంలో చోటుచేసుకుంది.

    బ్లాక్​ ఫంగస్​తో ఇల్లాలు..

    ఇలాంటి విషాద ఘటన కర్ణాటక (Karnataka)లో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు (suicide) పాల్పడటం సంచలనంగా మారింది. రాష్ట్రంలోని బెళగావి జిల్లా హుక్కేరి సమీపంలోని బొర్గాల్‌ గ్రామంలో తండ్రి సహా నలుగురు పిల్లలు విగతజీవులుగా కనిపించారు. గత ఏడాది బ్లాక్‌ ఫంగస్‌ (black fungus)తో భార్య జయక్క (jayakka) మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

    భార్య మరణించిన నాటి నుంచి..

    భార్య మరణించిన నాటి నుంచి భర్తతో పాటు పిల్లలు కూడా తీవ్రమైన విషాదంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐదుగురు కుటుంబ సభ్యులు విషం తాగి ఆత్మహత్య (suicide) చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (police) పరిశీలించారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ (suicide note)ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్లాక్‌ ఫంగస్‌ (black fungus) తో భార్య చనిపోవడంతో తాను తీవ్రంగా కుమిలిపోతున్నామని భర్త హదిమిణి సూసైడ్‌ నోట్‌ (suicide note)లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు మాజీ ఆర్మీ ఉద్యోగి గోపాల్‌ దొడ్డప్ప హదిమణి (47), పిల్లలు సౌమ్య (20), స్వాతి (17), సాక్షి (13), సృజన్‌ (10)గా గుర్తించారు పోలీసులు.

    ఆహారంలో విషం..

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు (police) దర్యాప్తు చేపడుతున్నారు. తండ్రి తన పిల్లలకు విషం (poison) కలిపిన ఆహారాన్ని (food) తినిపించి, ఆ తర్వాత తాను విషం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అంత్యక్రియలో కోసం (for last rites) తాను రూ.20 వేలు పక్కన పెట్టానని, పోలీసుల సహాయం (police help)తో వాటిని నిర్వహించాల్సిందిగా ఇరుగుపొరుగు వారిని కోరినట్లు సూసైడ్‌ నోట్‌ (suicide note)లో హదిమణి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Crime news, Family suicide, Karnataka, Wife die with corona

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు