తల్లి, చెల్లి, మరదలిపై అత్యాచారం.. మద్యం మత్తులో వరసలు మరిచి..

జాదవ్ వేధింపులతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు అతడిని చంపేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. తల్లీ, తండ్రి, చెల్లి, తమ్ముడు, మరదలు కలిసి అతడిని గొంతు నులిమి చంపేశారు.

news18-telugu
Updated: November 19, 2019, 6:06 PM IST
తల్లి, చెల్లి, మరదలిపై అత్యాచారం.. మద్యం మత్తులో వరసలు మరిచి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం మత్తులో ఓ యువకుడు రాక్షసుడిలా మారాడు. వావి వరసలు మరిచి సొంత కుటుంబ సభ్యులపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని, తమ్ముడి భార్యను.. ఇలా ఇంట్లో ఉన్న ఆడవారందరిపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి ఆగడాలు శృతిమించడంతో కుటుంబ సభ్యులే అతడిని చంపేశారు. మధ్యప్రదేశ్‌లోని దతియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌దాస్ కొండ ప్రాంతంలో ఈ నెల 12న ఓ యువకుడి మృతదేహం దొరికింది. దీనిపై లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడిని 24 ఏళ్ల సుశీల్ జాదవ్‌గా గుర్తించారు. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో అతడు చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

కుటంబ సభ్యులపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించగా సంచలన విషయం బయటపడింది. కుటుంబ సభ్యులే అతడిని గొంతు నులిమి చంపేశారని వెల్లడయింది. ఎందుకలా చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. వారి నుంచి ఎవరూ ఊహించని సమాధానం వచ్చింది. సుశీల్ జాదవ్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి. మద్యం మత్తులో కన్న తల్లి, తోడపుట్టిన చెల్లితో పాటు తమ్ముడి భార్యనూ పలుమార్లు అత్యాచారం చేశాడు.

ఈ నెల 11న కూడా మద్యం తాగి ఇంట్లో నానా రచ్చ చేశాడు జాదవ్. తాగిన మైకంలో మరదలిపై అత్యాచారానికి యత్నించాడు. జాదవ్ వేధింపులతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు అతడిని చంపేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. తల్లీ, తండ్రి, చెల్లి, తమ్ముడు, మరదలు కలిసి జాదవ్‌ను గొంతు నులిమి చంపేశారు. అనంతరం గోపాల్ దాస్ కొండ ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు. తామే చంపేశామని కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>