Home /News /crime /

FAMILY ISSUE WIFE BEATEN TO DEATH BY HUSBAND IN TAMIL NADU SU

Sad: సాఫీగా సాగిపోయే సంసారం.. ఆ ఒక్క ప్రశ్న వారి జీవితాలను తలకిందులు చేసింది..

ముత్తు, విజయలక్ష్మి

ముత్తు, విజయలక్ష్మి

ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.. ఆనందంగా సాగిపోతున్న జీవితం. ఉపాధి కోసం బేకరీ షాప్‌ నడుపుతున్నారు.

    ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.. ఆనందంగా సాగిపోతున్న జీవితం. ఉపాధి కోసం బేకరీ షాప్‌ నడుపుతున్నారు. అయితే ఊహించని పరిణామాలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. 40 ఏళ్ల ముత్తు చెన్నై అంబత్తూరులోని సూరపట్టు పక్కన జేపీ నగర్ రెండో వీధికి చెందినవాడు. అతనికి భార్య విజయలక్ష్మి, కూతురు దీపశ్రీ(14), కొడుకు వసంత్(10) ఉన్నారు. వారు అంబత్తూరు-చెంగున్రామ్ ప్రధాన రహదారి పక్కన బేకరీ షాప్ నిర్వహిస్తున్నారు. ముత్తు రోజు ఉదయం వెళ్లి బేకరీ చూసుకునేవాడు. అయితే మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు. ఆ సమయంలో తన భార్య విజయలక్ష్మిని బేకరీకి పంపి పనులు చూసుకోమనేవాడు.

    మళ్లీ సాయంత్రం పూట ముత్తు బేకరీకి వెళ్లేవాడు. గత కొంతకాలంగా ఇలాగే జరుగుతూ వచ్చింది. ఇక, ఇటీవల ఓరోజు సాయంత్రం పూట బేకరీకి వెళ్లిన ముత్తు.. పనులు ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి చేరాడు. అయితే ముత్తు ఇంటికి చేరుకున్నాక విజయలక్ష్మి.. ప్రతిరోజు మధ్యాహ్నం తనను బేకరీకి పంపి ఇంట్లో ఏం చేస్తున్నారని భర్తను ప్రశ్నించింది. ఇది కాస్తా భార్యభర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన ముత్తు.. విజయలక్ష్మి ముఖం, తలపై దాడి చేశాడు. దీంతో విజయలక్ష్మి స్పృహ కోల్పోయింది.

    ఇవి చదవండి: Hyderabad: ఆ పని చేసిన 24 గంటల్లోనే పోలీసులకు చిక్కిన డ్యాన్స్ మాస్టర్.. అసలేం జరిగిందంటే..

    Horrific Crime: ఇలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదు.. భార్య ముఖంపై ముసుగు ధరించలేదని..

    హోటల్‌లో రూమ్ నెంబర్ 405.. గదిలో కనిపించిన సీన్‌ చూసి షాక్ తిన్న పోలీసులు.. వైరల్‌గా మారిన ఆడియో.. అసలేం జరిగింది..?

    ఇది గమనించిన బంధువులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెకు గాయాలు అయినట్టుగా గుర్తించిన వైద్యులు.. ప్రత్యేకంగా చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో విజయలక్ష్మి మరణించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి విజయలక్ష్మి బంధువైన చిత్ర.. అంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ రామస్వామి నేతృత్వంలోని పోలీసుల బృందం..ముత్తును అరెస్ట్ చేసి అంబత్తూరు కోర్టులో హజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. అయితే ఆనందంగా గడిచినపోతున్న వారి జీవితాల్లో ఈ విధమైన విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Husband kill wife, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు