హోమ్ /వార్తలు /క్రైమ్ /

tragic accident : ఒకే ప్రయాణంలో రెండు ప్రమాదాలు.. తల్లీకూతుళ్ల దుర్మరణం.. తండ్రీకొడుకు పరిస్థితి విషమం

tragic accident : ఒకే ప్రయాణంలో రెండు ప్రమాదాలు.. తల్లీకూతుళ్ల దుర్మరణం.. తండ్రీకొడుకు పరిస్థితి విషమం

రోడ్డుప్రమాదంలో చనిపోయిన తల్లీకూతుళ్లు కల్పన, కృతికశివాని

రోడ్డుప్రమాదంలో చనిపోయిన తల్లీకూతుళ్లు కల్పన, కృతికశివాని

ఆ కుటుంబం ఒకే దారిలో గంటల వ్యవధిలో రెండు సార్లు ప్రమాదానికి గురైంది. తొలి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినా, రెండోసారి జరిగిన ప్రమాదం తల్లీకూతుళ్లను బలి తీసుకోగా, తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకుల పరిస్థితి విషమంగా ఉంది.

శుభకార్యానికి వెళుతోన్న ఓ కుటుంబాన్ని మృత్యుదేవత వెంటాడింది.. ఒక సారి వారు తప్పించుకున్నా.. అదే ప్రయాణంలో రెండోసారి మాత్రం మృత్యువే గెలిచింది. ఆ కుటుంబం ఒకే దారిలో గంటల వ్యవధిలో రెండు సార్లు ప్రమాదానికి గురైంది. తొలి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినా, రెండోసారి జరిగిన ప్రమాదం తల్లీకూతుళ్లను బలి తీసుకోగా, తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకుల పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో ఆదివారం చోటుచేసుకున్న అనూహ్య ఘటనకు సంబంధించి గుమ్మడిదల పోలీస్ స్టేషన్ ఎస్సై విజయకృష్ణ చెప్పిన వివరాలివి..

గుమ్మడిదలకు చెందిన కుమ్మరి బ్రహ్మచారి(32) ఆయన భార్య కల్పన(25), కూతురు కృతిక శివాని(4), కొడుకు కార్తీక్(2) ఒకే రోజు ఒకే మార్గంలో రెండు సార్లు ప్రమాదాలకు గురయ్యారు. బ్రహ్మచారి కుటుంబం ఆదివారం నాడు హైదరాబాద్ శివారులోని బొల్లారంలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకుగానూ సాయంత్రం 4 గంటలకు మోపెడ్ బైక్ పై బయలుదేరారు. గుమ్మడిదల నుంచి దోమడుగు వద్దకు చేరుకోగా, అక్కడి మలుపు వద్ద వీరి వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడగా, వెంటనే అన్నారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత..

cm kcr కుట్ర.. etela rajender ప్రతీకారం.. trs నం.3 KKతొ ఆలింగనం వెనుక ఇంత కథా?



యాక్సిడెంట్ తో పిల్లలు భయపడటంతో ఇక శుభకార్యానికి వెళ్లొద్దని నిర్ణయించుకుని తిరిగి అదే బండిపై ఇంటిబాట పట్టారు. విషాదకరంగా తిరుగుప్రయాణంలో మళ్లీ దోమడుగు పరిధిలోకి రాగానే ఓ మలుపు వద్ద బ్రహ్మాచారి బైక్ రెండోసారి అదుపుతప్పి, డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బండి మీద నుంచి ఆ నలుగురూ ఎగిరిపడ్డారు.

ప్రమాద స్థలం

shilpa choudhary : సెలబ్రిటీ శిల్పా చౌదరి ఇలా అయిందే! -బ్యాంక్ అకౌంట్‌లో షాకింగ్ నంబర్ -మహేశ్ బాబు చెల్లికి మాత్రం..



స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి.. గాయపడ్డ కుటుంబాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి వెళ్లేలోపే తల్లీకూతుళ్లు కల్పన, కృతిక శివానీ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బ్రహ్మాచారి, కార్తీక్ ల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Published by:Madhu Kota
First published:

Tags: Road accident, Sangareddy

ఉత్తమ కథలు