Home /News /crime /

FAMILY DISPUTES HUSBAND MOLESTED HIS WIFE IN MAHARASHTRA PAH

Shocking: దంపతుల మధ్య గొడవ.. కోపంతో తన భార్యపై సాముహిక అత్యాచారం చేయించిన భర్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: ప్రస్తుతం మన సమాజంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకున్న భర్త.. కట్టుకున్న భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

Husband molested his wife in maharashtra: నేటి సమాజంలో కొంత మంది వివాహా బంధానికి ఉన్న గొప్పతనాన్ని అపహాస్యం చేస్తున్నారు. చిన్నపాటి గొడవలు, కలహాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా పనులు చేస్తున్నారు. పెళ్లి అయ్యాక.. గొడవలు, కలహాలు సహజం. వాటిని పరిష్కరించుకుంటూ జీవితాన్ని సాఫీగా కొనసాగానివ్వాలి. కానీ కొందరు మాత్రం క్షణికావేశంలో విచక్షణను కోల్పోయి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల భార్య, భర్తలు వివాహేతర సంబంధాలను కూడా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక ఆలు మగల కోపానికి సంబంధించిన వార్త ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని నిలంగా ప్రాంతంలో దారుణం జరిగింది. ఒక మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయంలో ఒక ఇంటిని నిర్మించుకుని దానిలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో విసిగిపోయిన భర్త.. భార్యను ఆమె పుట్టింటికి వెళ్లి వదిలేసివచ్చాడు.ఈ క్రమంలో కొద్ది రోజులకు భార్య.. తల్లి వచ్చి వారిని ఓదార్చి ఆమెను ఇక్కడే దిగబెట్టి వెళ్లారు. అప్పుడు వారి మధ్య మరల గొడవలు సంభవించాయి. దీంతో అతను కోపంతో.. విచక్షణను కోల్పోయాడు. వెంటనే తన భార్యను గదిలో బంధించి, తన పొలం యజమాని, అతని సోదరుడితో కలిసి అఘాయిత్యం చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గుజరాత్ లో అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్ సబర్బన్ మణినగర్ లో అనూహ్య ఘటన ఒకటి రిపోర్ట్ అయింది.

తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో ముందు నుంచే తన సోదరికి వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయాన్ని బావ(అక్క భర్తకు) చెప్పినా పరిస్థితి మారలేదని, ఇలాంటి విషయాలు బయటికి పొక్కితే కుటుంబం పరువు పోతుందని పెద్దలు హెచ్చరించారంటూ తన దుస్థితిని వెళ్లబోసుకుంది బాధిత మహిళ. అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించిన బాధితురాలు.. కౌన్సిలర్ల నుంచి సాయం కోరింది. దురాగతానికి ఏమాత్రం తక్కువకాని ఈ ఘటన వివరాలను అభయం కౌన్సిలర్లు వెల్లడించారు..

మణినగర్ లో నివాసం ఉంటోన్న మహిళకు నాలుగేళ్ల కిందట పెళ్లయింది. భర్త ఉండగానే ఆమె మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నేళ్లుగా వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగింది. అయితే ఆ వ్యక్తికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబందాలు చూడటం మొదలుపెట్టారు. మరిదికి వేరే అమ్మాయితో పెళ్లయితే తనను ఎక్కడ దూరం పెడతాడో అనే ఆలోచనలో ఆ మహిళ నీచానికి దిగింది. తన అక్రమ సంబంధం గుట్టును దాచిపెట్టడానికి సొంత చెల్లెలి జీవితాన్ని పణంగా పెట్టింది. తాను వివాహేతర సంబందం కొనసాగిస్తున్న ప్రియుడు(మరిది)తో చెల్లెలికి పెళ్లి జరిపించింది. పెద్దల సమక్షంలో వివాహం జరిగిన కొద్ది రోజులకే బాధితురాలికి విషయం తెలియవచ్చింది.

కాపురానికి అత్తింటికి వెళ్లిన బాధితురాలు.. తన భర్త, అక్కలు చనువుగా ఉండటం చూసి మొదట్లో లైట్ తీసుకుంది. కానీ రోజూ రాత్రి భర్త భార్యను ముట్టుకోకుండా వదిన దగ్గరికి వెళుతుండేవాడు. కొద్దిరోజుల్లోనే విషయం అర్థం చేసుకున్న బాధితురాలు.. జరుగుతోన్న తంతును బావగారికి వివరించింది. కానీ అతడు అశక్తుడిలా ఉండిపోయాడు. అక్క, భర్తల మధ్య సాగుతోన్న తంతును భరించలేకపోయిన ఆమె రెండు కుటుంబాల్లోని పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కానీ వాళ్లు కూడా కుటుంబం పరువు పోతుందని, కామ్ గా ఉండమని బాదితురాలికి సలహా ఇచ్చినట్లు కౌన్సిలింగ్ లో వెల్లడైంది. ఈ ఘటనలో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ అవసరమని అభయం హెల్ప్ లైన్ ప్రతినిధులు అంటున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Husband harassment, Maharashtra

తదుపరి వార్తలు