హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్య ఇంత పని చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.. చివరకు..

ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్య ఇంత పని చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.. చివరకు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Crime News: రెండేళ్ల క్రితం వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా జంటలో కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వారిద్దరు ప్రేమించి పెళ్లి (Marriage) చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా జంటలో కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రాహుల్‌గౌడ్, సుందరయ్య నగర్‌కు చెందిన మౌనిక రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.మొదట వీరిద్దరు అన్యోన్యంగా గడిపారు. తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన భార్య మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. వారిద్దరినీ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలిగ్ ఇచ్చారు.

వాళ్లిద్దరు స్నేహితులు.. ఓ రోజు పొలం పనులకని వెళ్లారు.. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు.. అసలేం జరిగిందంటే..


దీంతో కట్టుకున్న భార్యతనపై ఇలా ఫిర్యాదు చేయగా తీవ్ర మనస్తాపానికి గురైన రాహుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇలా చేయడంతో.. అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ తన వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Minor Girl Kidnap: ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు అతడు చేసిన చర్యకు పోలీసులు ఆశ్చర్యపోయారు..


మృతుడి తండ్రి ఇదివరకే మరణించగా ఉన్న ఒక్క కొడుకును కొల్పోవడంతో తల్లి అనాథగా మిగిలిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు.. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. అయితే ఇటీవల చిన్న చిన్న కారణాలతో చాలా మంది క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. దానికోసం ప్రయత్నించాలి కానీ ఇలా ఆత్మహత్యలకు పాల్పడితే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని దీని వల్ల జరిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణలోన పులు జిల్లాల్లో తల్లిదండ్రులకు తరచూ గొడవ .

వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ బాలికను నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లారు.. చివరకు..


ఇది చూసిన కుమార్తె ( 21 ) మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కన్నీరు మిగిల్చగా.. వివాహం జరిగి ఎనిమిదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో మనస్థాపం చెంది మరొకరు ఆత్మహత్యకు పాల్పడగా.. కుమార్తెతో గొడవ పెట్టుకొని తల్లి ఆత్మహత్య చేసుకోవడం.. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు. వారికి చిన్న గొడవ పెద్ద కారణంగా కనిపించింది . అర్ధం చేసుకుని సర్దుకుపోతే కుటుంబంతో సంతోషంగా జీవించొచ్చని గుర్తించలేదు . క్షణికావేశంలో తనువు చాలించి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు .

Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..


కారణాలు ఏవైనా ఆత్మహత్యలు ఎక్కువగానే జరుగుతున్నాయి . ఇందులో బాల , బాలికలు ఉన్నారు . ఏదో ఒక వర్గం కాకుండా అన్ని వయసుల వారిలో క్షణికావేశం ఆత్మహత్యలకు పాల్పడుతన్నారు. అనాలోచిత నిర్ణయం ప్రాణాలు తీస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారం లభిస్తుందనే సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి. ఇందుకు అనుకూలంగా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి. అప్పుడే బతుకు పై ఆశ కుటుంబంపై బాధ్యత పెరుగుతుంది.

First published:

Tags: Adilabad, Attempt to suicide, Crime, Crime news

ఉత్తమ కథలు