Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నారు.. కొడుకు పైన గదిలో రెండో భార్యతో ఏంచేశాడంటే..

కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నారు.. కొడుకు పైన గదిలో రెండో భార్యతో ఏంచేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: అతడు మొదటి భార్యతో విడిపోయాడు. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. రెండో భార్యకు ఒక పిల్లాడు పుట్టాడు.

కొందరు భర్తలు షాడిస్ట్ లుగా ప్రవర్తిస్తుంటారు. తమ భార్యలపై దారుణాలకు పాల్పడుతుంటారు. కొందరు నోటికొచ్చినట్లు కొడుతూ.. దాడులు చేస్తారు. భార్యలను పోషించడం చాతకాక కొంత మంది తాగుడుకు బానిసౌతారు. ఈ క్రమంలో ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. దీంతో కుటుంబం కాస్త వీధిన పడుతుంది. కొంత మంది కోపంలో హత్యలు చేయడానికి సైతం వెనుకాడరు. ఇలాంటి ఘటనలు మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi)  దారుణం జరిగింది. విజయ్ (38), అనే వ్యక్తి, సంతోషి దేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఇది రెండో వివాహం. మొదటి భార్యతో కుటుంబ తగాదాల (Family disputes)  వలన విడిపోయాడు. ఆమెకు నలుగురు సంతానం. విజయ్ ఆస్పత్రిలో పనిచేసేవాడు. రెండో భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు భార్యభర్తలు (Harassment)  తగువులాడుకునే వారు.

అయితే, జూన్ 17న రాత్రి కూడా భార్యభర్తలు తగవులాడుకున్నారు. అప్పుడు ఇంట్లో వారు బయట పడుకున్నారు. అప్పుడు.. వీరి మధ్య గొడవ పీక్స్ కు వెళ్లింది. దీంతో కోపం పట్టలేక విజయ్ భార్యపై దాడిచేశాడు. రాడ్ తో కొట్టాడు. భార్య కొట్టద్దన్న వినలేదు. అతని దెబ్బలకు తాళలేక (Brutally attack)  ఆమె కుప్పకూలీపడిపోయింది. ఆమెను గుడ్డలో చుట్టి ఇంట్లో బాత్రూంలో దాచాడు. ఆ తర్వాత.. జూన్ 18 న పోలీస్ స్టేషన్ వెళ్లి భార్యను చంపానని లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దారుణం జరిగింది.

ఢిల్లీలోని మయూర్ విహార్‌(Mayur Vihar)లో 30 ఏళ్ల మహిళను... అత్తింటివారు బిల్డింగ్ టెర్రస్‌(Building Terrace)పై నుంచి తోసేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బిల్డింగ్‌ టెర్రస్‌ పై నుంచి కింద రోడ్డుపై పడిపోయిన మహిళ(Woman)ను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను దగ్గర్లోని మాక్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆ మహిళకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం... బాధితురాలు రచనకు 3 సంవత్సరాల క్రితం మయూర్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిలోక్‌పురి నివాసి పునీత్ ఉంట్వాల్‌తో వివాహం జరిగింది.

తన సోదరిని అత్తింటి వారు బిల్డింగ్‌ టెర్రస్‌ నుంచి కిందకు తోసివేశారని బాధితురాలు రచన సోదరుడు ఆరోపించాడు. తన సోదరిని ఆమె బావ, ఆయన భార్య బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

First published:

Tags: Crime news, Delhi, Harassment

ఉత్తమ కథలు