హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు.. ఆ ఒక్క మాట కాదన్నందుకు శాడిస్టుగా మారింది.. తన పిల్లలతో కలిసి ఏకంగా...

OMG: భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు.. ఆ ఒక్క మాట కాదన్నందుకు శాడిస్టుగా మారింది.. తన పిల్లలతో కలిసి ఏకంగా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: ఒక మహిళ తన భర్తమీద కోపంతో శాడిస్టుగా మారింది. అతగాడు.. తన భార్యను ఎనిమిదేళ్లుగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అయితే, ఈ మధ్య పెళ్లికి వెళ్తానని భర్తకు చెప్పింది.

Woman and her 2 children found suicide in Gujarat: కొందరు చిన్న చిన్న విషయాలకు తమ దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు చెప్పినదానికి ఒప్పుకోకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షలో  తప్పామని, సరైన ఉద్యోగం రాలేదని, ప్రేయసీ పెళ్లికి ఒప్పుకోలేదని సిల్లి రిజెన్స్ తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో చూస్తునే ఉంటాం. ఇక్కడోక మహిళ తనను భర్త పెళ్లికి పోనివ్వలేదని సిల్లి రిజన్ తో సూసైడ్ చేసుకుంది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని సూరత్ లో దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. సోథియా గ్రామంలోని ఒక జంట ఎనిమిదేళ్ల క్రితం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడేళ్లు, మరోకరికి ఐదేళ్లు. అయితే, సదరు వ్యక్తి భార్య, తన పుట్టింటికి పెళ్లికి వెళ్తానని భర్తను కోరింది. తనకు డబ్బులు ఇవ్వాలని అడిగింది. అయితే, సదరు వ్యక్తి మాత్రం పెళ్లికి వెళ్లడానికి అంగీకరించలేదు.

అత్తింటి వారు కూడా ఎవరు దీనికి ఒప్పుకోలేదు. దీంతో మహిళ కోపంతో తన విచక్షణను కోల్పోయింది. తన భర్తమీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపింది. తన గ్రామానికి దగ్గరలో ఉన్న.. గోండా గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ దగ్గరకి తన పిల్లలతో పాటు చేరుకుంది. ఆ తర్వాత వేగంగా వస్తున్న రైలు ముందు దూకి సూసైడ్ చేసుకుంది. ఎంత సేపటికి కోడలు ఇంటికి రాకపోవడంతో అత్తింటి వారు వెతకడం ప్రారంభించారు. కాసేపటికి వీరు పట్టాలమీద విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. క్షణికావేశంలో మహిళ తీసుకున్న నిర్ణయం వలన మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Woman Gangraped In UP's Shahjahanpur

ప్రస్తుతం మహిళలపై ప్రతిరోజు అఘాత్యాలు జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు.. దిశ, నిర్భయ వంటి ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన కొందరు నీచులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళను ఐదుగురు కామాంధులు ఇంటిలోపలికి లాక్కెళ్లారు. ఆ తర్వాత.. ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో మిగతా వారు ఘటనను తమ సెల్ ఫోన్ లో బంధించారు. ఈ ఘటన ఏప్రిల్ 22 న జరిగినట్లు బాధితురాలు తెలిపింది. ఘటన తర్వాత .. బాధితురాలిని నిందితులు బెదిరించారు.

పోలీసులకు చెబితే వీడియో వైరల్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో మరోసారి నిందితులు వేధింపులకు పాల్పడటంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. కాగా, ఈ దారుణానికి చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకొవడానికి  ప్రత్యేక  పోలీస్ టీమ్ లను రంగంలోనికి దింపారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Female harassment, Gujarat, Wedding, Women commits suicide

ఉత్తమ కథలు