Home /News /crime /

FAMILY BEATEN UP FORCED TO DRINK URINE FOR PRACTISING SORCERY IN WEST BENGAL PVN

Shocking : కుటుంబాన్ని చితకబాది వారితో మూత్రం తాగించిన గ్రామస్తులు!

చేతబడి ఆరోపణలతో కుటుంబంపై దాడి

చేతబడి ఆరోపణలతో కుటుంబంపై దాడి

Family beaten up forced to drink urine : వెస్ట్ బెంగాల్ లో అమానవీయ ఘటన జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే ఆరోపణలతో ఓ కుటుంబాన్ని దారుణంగా చితకబాది వారిచేత మూత్రాన్ని తాగించారు ఓ గ్రామస్థులు. 

Family beaten up forced to drink urine : వెస్ట్ బెంగాల్(West Bengal) లో అమానవీయ ఘటన జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే ఆరోపణలతో ఓ కుటుంబాన్ని దారుణంగా చితకబాది వారిచేత మూత్రాన్ని తాగించారు ఓ గ్రామస్థులు.  ముర్షీదాబాద్​ జిల్లాలో మథురాపుర్​లో ఈ ఘటన జరిగింది. రఘునాథ్​గంజ్​ ప్రాంతంలోని మథురాపుర్​లో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబంపై స్థానికులు దాడి చేసి వారిని చావగొట్టారు. అనంతరం వారి చేత మూత్రం తాగించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో రఘునాథ్​గంజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వైరల్ అవుతున్న వీడియోలో...ఓ కుటుంబాన్ని చుట్టుముట్టిన గుంపు వారి నుండి సమాధానాలు కోరుతూ మరియు అప్పుడప్పుడు ఆ కుటుంబంలోని ఓ వ్యక్తిని కర్రతో కొట్టినట్లు కనిపిస్తోంది. దీని తరువాత గ్రామస్తుల బలవంతంతో ఆ కుటుంబం డబ్బా నుండి ద్రవాన్ని బలవంతంగా తాగినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అవడంతో...నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ  Fire in Hospital : హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..మంటల్లో కాలిపోయిన 11మంది చిన్నారులు

అంతకుముందు బుధవారం ఉదయం కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. దక్షిణ్ దినాజ్​పుర్​ జిల్లాకు చెందిన లక్ష్మీరామ్​ హెమ్​బ్రమ్​ అనే వ్యక్తిని చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పలువురు దుండగులు హత్య చేశారు. అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం బతకలేకపోవచ్చని పక్కింట్లో ఉండే ఫాగు బస్కే అనే వ్యక్తికి లక్ష్మీరామ్​ హెమ్​బ్రమ్ జోస్యం చెప్పాడు. హెమ్​బ్రమ్​ జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫాగు బస్కే కుమారుడు.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Viral Video, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు