హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fact Check: కేంద్ర సర్వీసులకు తెలంగాణ డీజీపీ.. ఈ వార్త వెనుక వాస్తవం ఇదే

Fact Check: కేంద్ర సర్వీసులకు తెలంగాణ డీజీపీ.. ఈ వార్త వెనుక వాస్తవం ఇదే

వారిని వదలిపెట్టొద్దు.. అలాంటివారిని ఇబ్బందిపెట్టొద్దు.. తెలంగాణ పోలీసులకు డీజీపీ సూచనలు

వారిని వదలిపెట్టొద్దు.. అలాంటివారిని ఇబ్బందిపెట్టొద్దు.. తెలంగాణ పోలీసులకు డీజీపీ సూచనలు

Fact Check: సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఫేక్ వార్తల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. తాజాగా తెలంగాణ డీజీపీ కేంద్ర సర్వీసులలోకి వెళ్తున్నారని కొందరు ఫేక్ వార్త సృష్టించారు. ఏకంగా రాష్ట్ర డీజీపీపైనే తప్పుడు వార్తలు సృష్టించడం సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులతో పాటు.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ల సంచారం సైతం విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వం, పార్టీలు, వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని కొందరు తప్పుడు వార్తలను తయారు చేసి సోషల్ మీడియాలో వదలి రాక్షసానందం పొందుతున్నారు. ఆ మెసేజ్ లు నిజమని నమ్ముతున్న అనేక మంది వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలా ఫార్వర్డ్ చేసి కేసుల పాలైన అమాయకులు సైతం ఉన్నారు. దేశంలో లాక్ డౌన్ సీరియస్ గా సాగుతున్న సమయంలో తెలంగాణలో వైన్ షాపులు ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొందరు ఓ తప్పుడు మెసేజ్ ను సృష్టించి సోషల్ మీడియాలోకి వదిలారు. ప్రజలను నమ్మించడానికి ఓ ఫేక్ జీవోను సైతం తయారు చేశారు.

ఆ పోస్టు నిజమని భావించిన అనేక మంది ఇతరులకు ఫార్వర్డ్ చేశారు. దీంతో ఆ ఫేక్ జీవో వాట్సాప్ లో వైరల్ గా మారింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ గా తీసుకున్నారు. నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటన మచ్చుకు మాత్రమే. ఇలాంటి అనేక ఫేక్ మెసేజ్ లు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై సైతం ఇలాంటి తప్పుడు మెసేజ్ లు చక్కర్లు కొట్టడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్ షిప్ లు, కొత్త పథకాలంటూ నిత్యం అనేక తప్పుడు మెసేజ్ లు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.

తాజాగా తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తెలంగాణ డీజీపీ కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం పలువురు మీడియా ప్రతినిధుల దృష్టికి వళ్లడంతో వారు ఎంక్వైరీ చేయగా ఆ మెసేజ్ ఫేక్ అని తేలింది. ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ పైనే ఇలా తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ సైబర్ పోలీసులు ఫేక్ మెసేజ్ లను ఒక కంట కనిపెడుతున్నా.. తప్పుడు వార్తల సంచారం మాత్రం ఆగడం లేదు.

స్కూల్ పాఠ్యపుస్తకాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించనుందన్న మరో వార్త ఇటీవల సోషల్ మీడియా వేదికపై వైరల్ అవుతోంది. కాగా ఈ వైరల్ పోస్టు వెనుక వాస్తవాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదని పిఐబి ఫాక్ట్ చెక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వివరణ ఇచ్చింది. ‘స్కూల్ టెక్ట్స్ బుక్‌పై పన్ను విధించనున్నామని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ వార్త ’ అని ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

First published:

Tags: DGP Mahendar Reddy, Telangana Police

ఉత్తమ కథలు