హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lover: ఇది ప్రేమా.. ఇతను ఒకమ్మాయిని లవ్ చేశాడు.. ఆమెకు మరొకరితో పెళ్లి అయిపోయిందని తెలిసి..

Lover: ఇది ప్రేమా.. ఇతను ఒకమ్మాయిని లవ్ చేశాడు.. ఆమెకు మరొకరితో పెళ్లి అయిపోయిందని తెలిసి..

నిందితుడు సంతోష్

నిందితుడు సంతోష్

ప్రేమించడం తప్పు కాదు. కానీ ఎదుటి వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్నానని వెంటబడటం, ప్రేమించకపోతే చచ్చిపోతానని, చంపేస్తానని బెదిరించడం చాలా తప్పు. ఇలాంటి సైకోల కారణంగా ఎంతోమంది యువతులు అన్యాయంగా బలైపోయారు.

ఇండోర్: ప్రేమించడం తప్పు కాదు. కానీ ఎదుటి వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్నానని వెంటబడటం, ప్రేమించకపోతే చచ్చిపోతానని, చంపేస్తానని బెదిరించడం చాలా తప్పు. ఇలాంటి సైకోల కారణంగా ఎంతోమంది యువతులు అన్యాయంగా బలైపోయారు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువతులపై యాసిడ్ పోసిన ఘటనలు, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటనలు గతంలో చాలాచోట్ల జరిగాయి. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగుచూసింది. అయితే.. తాను ప్రేమించిన యువతికి పెద్దలు పెళ్లి చేశారన్న సంగతి తెలిసి ఆ యువతి ఇంటికెళ్లి ఆమె తల్లిని, సోదరుడిని సదరు సైకో లవర్ తుపాకీతో కాల్చాడు. అదృష్టవశాత్తూ గాయపడిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని శ్రీ కృష్ణ నగర్ ప్రాంతంలో సంతోష్ అనే 28 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని సంతోష్ కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతి ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా ఆమె వెంటపడటం, ప్రేమించాలని బలవంతం చేయడం చేశాడు. ఆ యువతి సంతోష్‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఇలా ఉంటున్న ఆ యువతికి ఇటీవల పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. పెళ్లి కూడా జరిపించారు. ఈ విషయం సంతోష్‌కు తెలిసింది.

ఇది కూడా చదవండి: Father and Daughter: ఏం పనులివి.. ఈ తండ్రీకూతురు ఏం చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారో తెలిస్తే...

తాను ప్రేమిస్తున్న అమ్మాయికి పెళ్లి చేసి పంపించడంతో సంతోష్ కోపంతో రగిలిపోయాడు. ఆమెకు పెళ్లి చేసిన ఆమె కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు. అక్టోబర్ 30న ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఆ యువతి పెళ్లి విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. సంతోష్‌ను ఆ యువతి అన్న, తల్లి వారించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లపై కోపంతో ఊగిపోయిన సంతోష్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో వాళ్లిద్దరిపై కాల్పులు జరిపాడు. వాళ్లిద్దరినీ తుపాకీతో కాల్చాక అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇది కూడా చదవండి: WifeHusband: భార్యాభర్తలంటే కష్టసుఖాలను పంచుకోవాలి.. కానీ వీళ్లిద్దరు మాత్రం.. ఈ చండాలం గురించి ఏం చెప్తాం..!

పోలీసులు ఈ ఘటన గురించి తెలిసి నిందితుడి కోసం వెతుకులాట సాగించగా శాంతినగర్ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సంతోష్‌ను కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన యువతి తల్లి, అన్నయ్యను ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా సంతోష్ తనను ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడని, అతని కుటుంబ పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేశానని, అలా వదిలేయడం వల్లే ఇంతవరకూ వచ్చిందని బాధిత యువతి చెప్పింది. పోలీసులు ఆ యువకుడికి తుపాకీ సప్లయ్ చేసిన వాళ్లు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రేమ పేరుతో సైకోలుగా మారి ఇబ్బందులకు గురిచేస్తున్న ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబం డిమాండ్ చేసింది.

First published:

Tags: Crime news, Lover, Madhya pradesh, Murder attempt

ఉత్తమ కథలు