విజయవాడ దుర్గగుడి పేరుతో నకిలీ వెబ్ సైట్లు

నకిలీ సైట్లను గుర్తించి ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

news18-telugu
Updated: December 10, 2019, 2:52 PM IST
విజయవాడ దుర్గగుడి పేరుతో నకిలీ వెబ్ సైట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం (File)
  • Share this:
ఈ మధ్య కాలంలో నకిలీ వెబ్ సైట్లు, నకిలీ ముఠాలు ఎక్కుపైపోతున్నారు. ఈ సైబర్ దొంగలు దేవుళ్లను కూడా వదలడం లేదు. ప్రముఖ ఆలయాల పేరుతో నకిలీ వెబ్ సైట్లను ఏర్పాటు చేసి భక్తుల్ని నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం పేరు మీద కొందరు నడుపుతున్న నకిలీ వెబ్ సైట్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు. నకిలీ సైట్లను గుర్తించి ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం మూడు నకిలీ వెబ్ సైట్లను అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో ఎంతమంది మోసపోయారన్న విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ సైట్లలో ఆన్‌లైన్లో డబ్బులు చెల్లించి అమ్మవారి సేవల కోసం భక్తులు రకరకాల సేవలకు సంబంధించిన టికెట్లు కొనుక్కుంటారు. తీరా గుడి వద్దకు చేరుకొనే సరికి భక్తులకు అలాంటి సేవలు అందడం లేదు. దుర్గగుడి ఒక్కటే కాదు, ఏలూరు ద్వారక తిరుమల  అన్నవరం, పెనుగంచిప్రోలు ఆలయంతో పాటు మరో ప్రముఖ ఆలయం విషయంలో కూడా కొందరు సైబర్ నేరగాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు ఈ కేసును సైబర్ క్రైం పోలీసులకు బదిలీ  చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>