ఇంట్లోనే యూనివర్సిటీ.. డబ్బు కొట్టు.. పట్టా పట్టు

తమిళనాడులోని నాగపట్నంలో నకిలీ యూనవర్సిటీ గుట్టు రట్టయింది. సెల్వరాజ్ అనే వ్యక్తి సుమారు ఏడేళ్లుగా ఓ నకిలీ యూనివర్సిటీని నడుపుతున్నాడు. రూ.2లక్షలకు ఒక్కో సర్టిఫికెట్ చొప్పున వెయ్యి మందికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించాడు.

news18-telugu
Updated: January 11, 2019, 2:40 PM IST
ఇంట్లోనే యూనివర్సిటీ.. డబ్బు కొట్టు.. పట్టా పట్టు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 11, 2019, 2:40 PM IST
డాక్టర్ కావాలంటే ఇంటర్ నుంచి కష్టపడి చదవాలి. నీట్‌లో ర్యాంకులు రావాలి. ఎంబీబీఎస్‌లో సీటు రావాలి. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కష్టపడి చదివితే అప్పుడు డాక్టరేట్ వస్తుంది. అయితే, అవన్నీ అవసరం లేదు. కేవలం రూ.2లక్షలు ఇస్తే, రెండంటే రెండు గంటల్లోనే మెడిసిన్ సర్టిఫికెట్ మీ చేతుల్లో పెట్టేస్తున్నాడు ఓ వ్యక్తి. తమిళనాడులోని నాగపట్నంలో ఓ రెండు గదుల ఇంట్లో ఏకంగా ఓ యూనివర్సిటీనే నడుపుతున్నాడు. అది కూడా ఏడేళ్లుగా యూనివర్సిటీని నడుపుతున్నాడు. తమిళనాడులోని నాగపట్నానికి చెందిన సెల్వరాజ్ అనే వ్యక్తి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని నెలకొల్పాడు. తన వద్దకు వచ్చిన వారికి ఏకంగా మెడిసిన్ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నాడు. రూ.2లక్షలకు ఒక్కో సర్టిఫికెట్ చొప్పున ఇప్పటి వరకు సుమారు వెయ్యి సర్టిఫికెట్లు జారీ చేసినట్టు తమిళనాడు వైద్య శాఖ అధికారులు గుర్తించారు.

నకిలీ యూనివర్సిటీ గుట్టు రట్టయిందిలా...
సెల్వరాజ్ ఏడేళ్లుగా ఈ నకిలీ యూనివర్సిటీని నడిపిస్తున్నాడు. అయితే, అతడు చేసిన ఓ పొరపాటు అతడ్ని పట్టించింది. 2019 ఏడాదికి సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ యూనివర్సిటీకి దరఖాస్తుల చేసుకోవచ్చంటూ ఓ తమిళ పత్రికలో భారీ ప్రకటన ఇచ్చాడు. దీంతో ఆ ప్రకటన ఏకంగా తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ గమనించారు. వైద్య శాఖ ఉన్నతాధికారి అయిన తనకు తెలియకుండా ఇలాంటి యూనివర్సిటీ ఎక్కడి నుంచి వచ్చిందా? అని ఆయన సందేహ పడ్డారు. ఇందులో ఏదో మతలబు ఉందని గ్రహించి వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ ప్రకటనలో ఇచ్చిన అడ్రస్‌కు ఆయనే స్వయంగా వెళ్లి చూశారు. కేవలం ఓ రెండు గదుల ఇంట్లో ఏకంగా ఓ ఫేక్ యూనివర్సిటీని పెట్టిన వారిని పట్టుకున్నారు. వెంటనే కిందిస్థాయి అధికారులు అందరినీ అక్కడకు పిలిపించి.. అక్కడున్న సామగ్రిని సీజ్ చేశారు. భారీ ఎత్తున ఖాళీ సర్టిఫికెట్లు, స్టాంప్‌లు, లెటర్ హెడ్లు, రిజిస్టర్లు, బ్యాంక్ అకౌంట్లకు చెందిన పాస్ బుక్‌లు సీజ్ చేశారు. సెల్వరాజ్‌సహా ఐదుగురిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు.

ఇంకో విచిత్ర ఏంటంటే సెల్వరాజ్ వద్ద నకిలీ సర్టిఫికెట్లు కొనుక్కున్న వారు సొంతంగా మెడికల్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. మరికొందరు ఆ సర్టిఫికెట్లను చూపించి ఇతర ఆస్పత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చీరాని వైద్యం చేసి వారు ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నారో అనే సందేహం కూడా వైద్యశాఖ అధికారులకు కలుగుతోంది. వెంటనే వారి వివరాలు సేకరించాల్సిందిగా అధికారులను డిప్యూటీ డైరెక్టర్ ఆదేశించారు.అన్నిటికన్నా షాక్ కలిగించే విషయం మరోటి కూడా ఉంది. తన వద్ద రూ.2లక్షలు పెట్టి దొంగ సర్టిఫికెట్లు కొన్న వారిని కూడా నిందితుడు సెల్వరాజ్ వదల్లేదు. వారిని మధ్య మధ్యలో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజేవాడనే విషయం వెలుగులోకి వచ్చింది. 2015 సంవత్సరంలో తమిళనాడులో 21 నకిలీ యూనివర్సిటీలను గుర్తించారు. అప్పుడు కూడా ఈ యూనివర్సిటీ బయటపడలేదు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...