FAKE TWO THOUSAND RUPEES NOTES IN PEDDAPALLI DISTRICT NS KNR
Fake Currency: ఆ ప్రాంతంలో ఫేక్ 2 వేల రూపాయల నోట్లు.. వణుకుతున్న వ్యాపారులు, ప్రజలు
మార్కెట్లో చెలామణి అవుతున్న దొంగ నోట్లు
పెద్దపెల్లి జిల్లా రామగుండం, గోదావరిఖనిలో రూ. 2 వేల ఫేక్ నోట్లు చెలామణి అవుతున్నాయన్న వార్త కలకలం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం గోదావరిఖని లక్ష్మినగర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వైట్ షిఫ్ట్ కారులో లో వచ్చి వివిధ దుకాణాల్లో కొనుగోళ్లు చేసినట్లు సమాచారం.
పెద్దపెల్లి జిల్లా రామగుండం, గోదావరిఖనిలో నకిలీ 2 వేల రూపాయల నోట్లు చెలామణి అవుతున్నాయన్న వార్త కలకలం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం గోదావరిఖని లక్ష్మీనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి వైట్ షిఫ్ట్ కారులో లో వచ్చి వివిధ దుకాణాల్లో కొనుగోళ్లు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు దొంగ నోట్లను మార్చుకుని వెళ్లాడన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. అతడు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వ్యక్తేనా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో సింగరేణి, పవర్ థర్మల్ స్టేషన్, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో సాధారణంగా ఆయా ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇక్కడే ఫేక్ నోట్లు తయారు చేసి చెలామణి చేస్తున్నారా? అన్న అనుమానం సైతం స్థానికంగా వ్యక్తమవుతోంది.
ఈ దొంగనోట్ల వెనకాలా ఏదైనా దొంగ నోట్ల ముఠా ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్థానికంగా దొంగనోట్ల సంచారం వార్తతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో రెండు వేల నోటు చూస్తేనే నకిలీదా? లేక నిజమైనదేనా? అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ దొంగనోట్ల ముఠాను త్వరగా పట్టుకోవాలని ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కరోనా కాలంలో అంతంత మాత్రంగానే సాగుతున్న తమ వ్యాపారాలపై ఈ నకిలీ నోట్లు ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎవరైనా రూ. 2 వేల నోటు తీసుకువస్తే నమ్మాలా? వద్దా అన్న సందేహం వ్యక్తమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ మనీని అరికట్టేందుకు కేంద్రం నాలుగేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేసింది. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో రూ. 200, రూ. 2 వేల నోట్లను తీసుకువచ్చింది. ఆ సమయంలో ప్రజలు తమ వద్ద ఉన్న కరెన్సీని మార్చు కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ నోట్ల రద్దుతో దేశానికి మేలు జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. అంత సీన్ జరగలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అవినీతి ఏ మాత్రం ఆగలేదని, నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు తప్పా.. ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మోదీ సర్కారుపై నేటికీ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.